Breaking News

పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ గూండాగిరీ

Published on Mon, 07/01/2024 - 03:21

ఆళ్లగడ్డ: అధికారం అండ చూసుకుని టీడీపీ శ్రేణులు పేట్రేగిపోతున్నాయి. పోలీసులు, పోలీస్‌స్టే­ష­న్లన్నా లెక్కే లేకుండా పోయింది. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న నవ దంపతులపై సాక్షాత్తు సీఐ ఎదురుగానే దాడికి దిగారు. ప్రేమికుడిని బయటకు లాక్కొచ్చి చితకబాదారు. పోలీసుల సమక్షంలోనే ఇష్టమొచ్చి­నట్లు కొట్టారు. ఈ ఘటన శనివారం రాత్రి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చోటు చేసుకుంది. స్థాని­కులు, పోలీసుల కథనం మేరకు.. మండల కేంద్రం చాగలమర్రికి చెందిన సాయి అనే యువతి, వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు పట్టణానికి చెందిన ప్రవీణ్‌ అనే యువకుడు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

పెళ్లి చేసుకుంటామని కోరగా, యువతి కుటుంబ సభ్యులు అడ్డు చెప్పారు. ఈ క్రమంలో వారం క్రితం ఇద్దరూ ఇంట్లో చెప్పకుండా బయ­ట­కొచ్చి పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యుల నుంచి తనకు, తన భర్తకు ప్రాణహాని ఉందని రెండు రోజుల క్రితం యువతి చాగలమర్రి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. అక్కడి ఎస్‌ఐ.. ఇరు కుటుంబాల వారిని పిలిపించి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. సమస్య పరి­ష్కారం కాకపోవడంతో సీఐ వద్దకు వెళ్లి మాట్లాడు­కోవాలని సూచించారు. దీంతో శనివారం మధ్యా­హ్నం నవ దంపతులు స్థానిక సర్కిల్‌ కార్యాలయం వద్దకు వచ్చారు.

యువతి కుటుంబ సభ్యులను పిలిపించి సీఐ మాట్లాడారు. కుటుంబ సభ్యుల వెంట వెళ్లనని, భర్త వెంటే ఉంటానని యువతి తెగేసి చెప్పింది. ఇద్దరూ మేజర్లు కావడంతో వారి ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకునే హక్కు ఉందని, వారికి ఎటువంటి హాని తల పెట్టవద్దని సీఐ చెప్పారు. దీంతో యువతి సోదరుడు పట్టణంలోని టీడీపీ కార్యా­లయం వద్దకు చేరుకుని అక్కడున్న వారికి విష­యం చెప్పాడు. రెండు కార్లలో మను­షులను వెంటబెట్టుకుని సర్కిల్‌ కార్యాలయం చేరుకు­న్నాడు.

వచ్చీ రాగానే టీడీపీ కార్యకర్తలంతా పోలీ­సులు చూస్తుండగానే యువకుడిపై విచక్షణా రహి­తంగా దాడి చేశారు. దెబ్బలు తట్టుకోలేక యువ­కుడు సీఐ గదిలోకి వెళ్లి దాక్కున్నప్పటికీ, బయటకు ఈడ్చుకు వచ్చి కొట్టారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ లెక్క చేయలేదు. అక్కడి పరిస్థితి చూసి.. యువకుడికి తోడుగా వచ్చిన బంధువులు, స్నేహితులు రోడ్డుపైకి పరుగులు తీసి చీకట్లో దాక్కున్నారు. 

ఫైర్‌ ఓపెన్‌ చేసేందుకు యత్నించిన సీఐ 
ప్రేమికులపై దాడి చేస్తున్న టీడీపీ శ్రేణులను పోలీసులు, సీఐ అడ్డుకుంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు ఏమాత్రం లెక్క చేయలేదు. పోలీసులపై తిరగబడే పరిస్థితి రావడంతో సీఐ హనుమంత నాయక్‌ ఫైర్‌ ఓపెన్‌ చేస్తానని రివాల్వర్‌ గురిపెట్టి హెచ్చరించారు. దీంతో వెనక్కు తగ్గిన వారు అక్కడి  నుంచి బయటకు వచ్చారు. వారు వచ్చిన కార్ల దగ్గర నిల్చొని ‘నువ్వు మా కార్యాలయం దగ్గరకు వస్తావు కదా.. అక్కడికి రా.. అప్పుడు నీ కథ ఉంటుంది’ అని బహిరంగంగా సీఐ వైపు వేలు చూపిస్తూ »ñబెదిరించినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో నవ దంపతులను పోలీస్‌ వాహనంలో అక్కడి నుంచి తరలించారు. మనస్తాపానికి గురైన సీఐ, ఇతర అధికారులు విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. సీసీ కెమెరాల్లోని పుటేజీ తెప్పించుకుని పరిశీలించిన ఎస్పీ.. విషయాన్ని రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై సీఐ మాట్లాడుతూ.. ఇరు కుటుంబాలను కూర్చోబెట్టి కౌన్సెలింగ్‌ ఇస్తుండగా, ఇరు వర్గాలు ఘర్షణ పడటంతో అందరినీ అరిచి అక్కడి నుంచి పంపించామన్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)