Breaking News

నందిగం సురేష్‌ కేసు.. పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు

Published on Fri, 11/22/2024 - 12:06

సాక్షి, ఢిల్లీ: మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఏపీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్ కిషోర్ మిశ్రా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

మాజీ ఎంపీ సురేష్‌ బెయిల్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నందిగం సురేష్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబాల్‌ వాదనలు వినిపిస్తూ..‘ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు. ఘటన జరిగిన ప్రాంతంలో సురేష్ లేరు. దర్యాప్తు అధికారి ఫేవర్ చేశారని  స్థానిక జడ్జి ఎలా చెబుతారు. 2020లో రాయి తగిలి మృతిచెందిన మరియమ్మ కేసులో 78వ నిందితుడుగా చేర్చి సురేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళితుడైన మాజీ ఎంపీ సురేష్ పేరును అక్రమంగా ఈ కేసులో చేర్చారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా టీడీపీ ప్రభుత్వం సురేష్‌పై కేసులు బనాయిస్తోంది. ఇతర కేసులు పెట్టి మాజీ ఎంపీని ప్రభుత్వం వేధిస్తోందన్నారు. వాదనల అనంతరం​, ధర్మాసనం పోలీసులకు నోటీసులు ఇచ్చింది.

మరోవైపు.. సురేష్‌ బార్య బీబీ లత మాట్లాడుతూ..‘టీడీపీ ప్రభుత్వం మాపైన అక్రమ కేసులు బనాయిస్తోంది. దళితుడు ఎదగడాన్ని ఓర్చలేక అసూయతో కేసులు పెడుతున్నారు. నాలుగేళ్ల నాటి కేసులో ఇప్పుడు అరెస్ట్ చేశారు. న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది. న్యాయపోరాటంలో మేము గెలుస్తాం. దేవుడు, మా అధ్యక్షుడు వైఎస్ జగన్ మాకు అండగా ఉన్నారని అన్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)