Breaking News

స్కిల్‌ కేసులో నేడు సుప్రీం విచారణ

Published on Tue, 05/07/2024 - 10:43

న్యూఢిల్లీ, సాక్షి: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్న స్కిల్‌ డెవపల్‌మెంట్‌ స్కాం కేసు ఇవాళ సుప్రీం కోర్టులో విచారణకు రానుంది.  ఈ కేసులో అరెస్టై 53 రోజులపాటు జైల్లో గడిపిన చంద్రబాబు.. బెయిల్‌ మీద బయట ఉన్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలంటూ నేర పరిశోధన విభాగం(CID) వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ విచారణ జరపనున్నారు. 

స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ షరతుల్ని ఉల్లంఘించారన్నది సీఐడీ వాదన. అంతేకాదు.. రెడ్‌బుక్‌ పేరుతో అధికారుల్ని ఆయన తనయుడు నారా లోకేష్‌ సైతం విచారణ అధికారుల్ని బెదిరిస్తున్నాడన్నది మరో అభియోగం. ఈ రెండింటిపైనా సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరగుతోంది. ఇదిలా ఉంటే.. బెయిల్ షరతులు ఉల్లంఘించొద్దని  గత విచారణలో చంద్రబాబుకు సుప్రీం కోర్టు వార్నింగ్ సైతం ఇచ్చింది.

ఇదీ చదవండి: స్కిల్‌ కేసు.. చంద్రబాబుకు సుప్రీం వార్నింగ్‌

గత విచారణలో సందర్భంగా.. సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది రంజిత్‌కుమార్‌ వాదిస్తూ.. ‘‘చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌లు స్కిల్ కేసు దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నారు. దర్యాప్తునకు భంగం కలిగేలా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. రెడ్ బుక్ లో అధికారులు పేర్లు రాసుకుంటున్నానని, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల అంతు చూస్తాను అని లోకేష్ బెదిరిస్తున్నారు. ఈ మేరకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అధికారులపై  బెదిరింపులకు పాల్పడ్డారు అని వాదించారు. దీంతో.. రెడ్ బుక్ అంశంపై దాఖలు చేసిన అప్లికేషన్  రికార్డులలో ఉంచాలని రిజిస్ట్రీని ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)