‘సాక్షి’ నిలిపివేతపై సుప్రీం సీరియస్‌

Published on Wed, 10/15/2025 - 05:11

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ‘సాక్షి’ టీవీ ప్రసారాల నిలిపివేతపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రైవేట్‌ మల్టీసిస్టమ్‌ ఆపరేటర్‌ ఎలా వాదిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో తన వైఖరిని తెలియజేస్తూ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆయుధంగా వాడుకుంటూ.. తమ చానల్‌ను ప్రజలకు చేరకుండా అణచివేస్తున్నారంటూ ‘సాక్షి’ టీవీ యాజమాన్యం దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పమిడిఘంటం శ్రీ నరసింహ, జస్టిస్‌ అతుల్‌ ఎస్‌.చందూర్‌కర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.   

ప్రజలను, కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు.. 
పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది నీరజ్‌కిషన్‌ కౌల్‌ వాదనలు వినిపిస్తూ.. ‘సాక్షి టీవీ ప్రసారాలను ఏపీ ప్రభుత్వం పూర్తిగా అడ్డుకుంటోంది. తన అధికారాన్ని, యంత్రాంగాన్ని ఒక ఆయుధంగా ప్రయోగించి సాక్షి చానల్‌ను ప్రజలకు దూరం చేస్తోంది. మా ప్రసారాలు ఎక్కడా కనిపించడం లేదు. కొందరు ఎమ్మెస్వోలు నిబంధనల ప్రకారం ‘అలా కార్టే’ పద్ధతిలో చానళ్లను అందిస్తున్నామని చెప్పడం కేవలం కంటితుడుపు చర్యే. కోర్టు విచారణకు రెండు రోజుల ముందు మాత్రమే మా చానల్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. విచారణ ముగిసిన వెంటనే మళ్లీ ప్రసారాలు నిలిపివేస్తున్నారు. ఇది ప్రజలను, న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించడమే’ అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.  

ప్రభుత్వం తరఫున ప్రైవేట్‌ ఆపరేటర్‌ ఎలా వాదిస్తారు?  
ఎమ్మెస్వో తరఫు న్యాయవాది ఆర్యమ సుందరం స్పందిస్తూ.. తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పారు. పిటిషనర్‌ చానల్‌ను ‘అలా కార్టే’ విధానంలో అందిస్తున్నామని తెలిపారు. దీనిపై జస్టిస్‌ నరసింహం అసహనం వ్యక్తం చేశారు. ‘అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్నది రాష్ట్ర ప్రభుత్వం. అలాంటప్పుడు, ప్రభుత్వం తరఫున ఒక ప్రైవేట్‌ ఆపరేటర్‌ ఎలా వాదిస్తారు? ఇది ఎంతమాత్రం సరికాదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమ వైఖరిని తెలియజేస్తూ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించారు. 



ప్రైవేట్‌ వ్యక్తులు ప్రభుత్వానికి బదులుగా సమాధానం చెప్పడాన్ని తాము అంగీకరించబోమని హెచ్చరించారు. ప్రధాన ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నందున.. ఈ కేసులో వారే స్వయంగా సమాధానం చెప్పాలని ధర్మాసనం తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ స్పందన అత్యంత కీలకమని పేర్కొంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరణతో కౌంటర్‌ దాఖలు చేసేందుకు.. విచారణను వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు తదుపరి విచారణను వీలైనంత త్వరగా చేపట్టేందుకు ధర్మాసనం అంగీకరించింది.   

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)