ఆ నెయ్యి వాడలేదు: లోకేశ్‌

Published on Tue, 09/24/2024 - 05:26

సాక్షి, అమరావతి: ఆ వెంకటేశ్వరస్వామే తనతో నిజాలు చెప్పించారేమో అని చెబుతున్న  సీఎం చంద్రబాబు తన తనయుడు నారా లోకేశ్‌ వ్యాఖ్యలతో అడ్డంగా దొరికిపోయారు! శ్రీవారి సాక్షిగా తండ్రీ కుమారుడు తమ బండారాన్ని తామే బయటపెట్టుకున్నారు!! టీటీడీ లడ్డూల తయారీకి వినియోగించిన నెయ్యి విషయంలో చంద్రబాబు చెబుతున్న దానికి పూర్తి విరుద్ధంగా లోకేశ్‌ సోమవారం ఎక్స్‌లో ట్వీట్‌ చేయడంతో టీడీపీ శ్రేణులు కంగుతిన్నాయి. 

జంతువుల కొవ్వు కలిపిన ఏఆర్‌ డెయిరీ నెయ్యిని లడ్డూల తయారీకి ఉపయోగించారని, వాటిని భక్తులు తిన్నారని చంద్రబాబు పదేపదే అబద్ధాలు చెప్పి నమ్మించేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. కానీ లోకేశ్‌ మాత్రం తాజాగా ట్వీట్‌లో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి లారీలు నాలుగింటినీ టీటీడీ తిప్పి పంపించేసిందని వెల్లడించి సీఎం స్థానంలో కూర్చున్న తన తండ్రి పచ్చి అబద్ధాల కోరని నిరూపించారు. నాలుగు నెయ్యి లారీలను తిప్పి పంపిన టీటీడీ రిపోర్టును తన ట్వీట్‌కు జత చేశారు. 

అందులో ఏఆర్‌ డెయిరీ సరఫరా చేసిన 8 నెయ్యి ట్యాంకర్లలో నాలుగు టెస్టుల్లో పాసవగా, నాలుగు ట్యాంకర్లలో నెయ్యి ప్రమాణాల ప్రకారం లేకపోవడంతో తిరస్కరణకు గురైనట్లు స్పష్టంగా పేర్కొన్నారు. చంద్రబాబు చెప్పేది నిజమా? లేక లోకేశ్‌ చెప్పేది నిజమా? అబద్ధాలు చెప్పడంలో ఇద్దరి మధ్యా సమన్వయం లేదా? కుమారుడికి అబద్ధాఆల ట్రెయినింగ్‌ సరిగా ఇవ్వలేదా? అనే చర్చ సోషల్‌ మీడియాలో జరుగుతోంది.  

జూన్‌ 12న తొలి ట్యాంకర్‌ టీటీడీకి  
జూన్‌ 12వ తేదీన ఏఆర్‌ డెయిరీ నుంచి తొలి ట్యాంకర్‌ టీటీడీకి చేరింది. అదే నెల 21, 25న రెండు, జూలై 4వ తేదీన మరో ట్యాంకర్‌ వచ్చాయి. మొత్తం నాలుగు నెయ్యి ట్యాంకర్లు టీటీడీ నిర్వహించిన పరీక్షల్లో నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఉన్నాయని తేలింది. అందుకే వాటిని స్వీకరించారు. ఆ తర్వాత జులై 6వ తేదీన వచ్చిన రెండు ట్యాంకర్లు, 12న వచ్చిన మరో రెండు ట్యాంకర్లు ప్రమాణాల ప్రకారం లేకపోవడంతో టీటీడీ వాటిని తిరస్కరించింది. 

లోకేశ్‌ జత చేసిన రిపోర్టులో ఈ విషయం స్పష్టంగా ఉంది. లేబొరేటరీ పరీక్షల్లో ఈ నాలుగు ట్యాంకర్లను తిరస్కరించారంటే అందులోని నెయ్యిని లడ్డూల తయారీకి వినియోగించలేదని విస్పష్టంగా తెలుస్తోంది. కానీ చంద్రబాబు ఆ నెయ్యిని వాడేసినట్లు, వాటితో తయారైన లడ్డూలను భక్తులను తినేసినట్లు చెబుతూ జనాన్ని తప్పుదోవ పట్టించారు.  

మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి ఇష్టం వచ్చినట్లు అడ్డగోలు భాషలో అడ్డంగా మాట్లాడే క్రమంలో లోకేష్‌ మరోసారి తాను పప్పునని బయట పెట్టుకున్నారు. వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి కొవ్వు ఎక్కువైందంటూ అధికారం అండతో అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించిన లోకేశ్‌ అదే ట్వీట్‌ ద్వారా తమ బాగోతాన్ని బహిర్గతం చేశారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.  

4 కల్తీ నెయ్యి ట్యాంకర్లను టీటీడీ తిప్పి పంపిందన్న లోకేశ్

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)