Breaking News

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

Published on Mon, 11/25/2024 - 04:13

గాజువాక: విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ ఉక్కు పోరాట కమిటీ, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళ, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం గాజువాకలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో నాయకులు మాట్లా­డుతూ ఆంధ్రప్రదేశ్‌కు మణిహారంగా ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని విజ్ఞప్తి చేశారు.

సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవే­టీక­రణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రధాని మోదీ తన విశాఖ పర్యటనలో సానుకూల నిర్ణ­యం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో కర్మాగారంపై, కార్మికులపై రుద్దుతున్న ఆర్థిక ఆంక్షలను తక్షణం విరమించుకునేలా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేంద్రంపై ఒత్తిడి చేయాలని డిమాండ్‌ చేశారు.

పోరాట కమిటీ చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని సాగుతున్న ఉద్యమానికి రాష్ట్ర అభివృద్ధితోపాటు ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)