Breaking News

దేవుడా.. ఇదేం విడ్డూరం!

Published on Sun, 12/28/2025 - 04:55

సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు టీటీడీ పిడుగులాంటి వార్తను విడుదల చేసింది. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో దివ్య దర్శనం, టైం స్లాట్‌ టోకెన్ల పంపిణీని ముందుగానే నిలిపి వేసింది. టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావొచ్చని ప్రకటించింది. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ తీసుకున్న నిర్ణయంపై భక్తులు మండిపడుతున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని డిసెంబర్‌ 30వ తేదీ నుంచి పది రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. టీటీడీ తాజా నిర్ణయంతో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం అందని ద్రాక్షలా మారింది. 

ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే వైకుంఠ ద్వార దర్శన టికెట్లు ఇవ్వడం ద్వారా గ్రామీణ, చదువుకోని భక్తులకు స్వామి వారి దర్శనా­న్ని దూరం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా లక్కుంటేనే వైకుంఠ ద్వార దర్శనం అంటూ ఆన్‌ లైన్‌ లక్కీ డిప్‌ విధానం అమలు చేయటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

హిందువులకు అత్యంత పవిత్రమైన ధనుర్మాసంలో భక్తులు ఆలయాలకు వెళ్లటం ఆనవాయితీ. ముఖ్యంగా కలియుగ వైకుంఠంలో కొలువైన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశ నలు మూలల నుంచి భక్తులు వస్తుంటారు. అలా వచ్చే వారిలో టోకెన్లు కలిగిన వారు, లేని వారూ ఉంటారు. ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు పొందలేని భక్తులు తిరుపతిలో టైం స్లాట్‌ టోకెన్లు తీసుకుని స్వామి వారి దర్శనానికి వెళుతుంటారు.

ఆ 3 రోజులూ తిరుమలకు రావొద్దు
డిసెంబర్‌ 30న వైకుంఠ ఏకాదశి, డిసెంబర్‌ 31న ద్వాదశి, జనవరి 1వ తేదీల్లో సామాన్య భక్తులు వెళ్లే సర్వ దర్శనం టోకెన్ల పంపిణీ నిలిపి వేసినట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఆ మూడు రోజుల్లో కేవలం ఆన్‌లైన్‌లో లక్కీ డిప్‌ ద్వారా టికెట్లు పొందిన వారిని మాత్రమే సర్వ దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. లక్కీ డిప్‌ టికెట్‌ లేని భక్తులు ఈ మూడు రోజులు తిరుమల దర్శనానికి రావద్దని ప్రచారం చేస్తోంది. 

జనవరి 2 నుంచి 8 వరకు ఆఫ్‌లైన్లో సర్వ దర్శనం కోసం అనుమతిస్తామని ఓ ప్రకటనలో వెల్లడించింది. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు, నడక మార్గంలో వచ్చే భక్తులను ఉద్దేశించి సోషల్‌ మీడియా, దినపత్రికల్లో టీటీడీ ప్రకటనలు సైతం ఇచ్చింది. అదే విధంగా గోవింద మాల ధరించిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండవని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు స్పష్టం చేశారు. మాల ధరించిన భక్తులు కూడా సర్వ దర్శనం ఆన్‌ లైన్‌ టికెట్లు ఉంటేనే అనుమతి ఇస్తామని చెబుతున్నారు. ఈ విషయం ఏపీ, తెలంగాణా, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని భక్తులకు కూడా తెలిసేలా విస్తృత ప్రచారం చేస్తున్నామని టీటీడీ ఈఓ తెలిపారు.

నిర్వహణ చేతకాకేనా?
గత వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో టోకెన్ల కోసం తొక్కిసలాట కారణంగా ఆరుగురు భక్తులు ప్రాణాలు కొల్పోగా, దాదాపు 40 మందికి పైగా భక్తు­లు గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో టీటీడీ తమ చేతికి మట్టి అంటకుండా అన్ని టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచి చేతులు దులుపుకుందని, నిర్వహణ చేతకాకే ఇ­లాంటి నిర్ణయం తీసుకుందని భక్తులు విమర్శి­స్తున్నా­రు. 

టీటీడీ తాజా నిర్ణయం కారణంగా తొలి మూడు రోజులు సామాన్య భక్తులు వైకుంఠ ద్వార దర్శనాలకు దూరం అయ్యారు. లక్కీ డిప్‌ పేరుతో టీటీడీ పాలక మండలి భక్తుల మనోభా­వాలతో ఆడుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తుతు­న్నాయి. వైకుంఠ ద్వార దర్శనాల్లో భాగంగా మొదటి మూడు రోజుల తర్వాత మిగిలిన ఏడు రోజుల్లో శ్రీవారి భక్తులను సర్వదర్శ­నానికి అనుమతిస్తామని చెబుతున్నారు.

స్థానికుల పైనా వివక్ష!
చంద్రబాబు పాలనలో డిప్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసి తమను శ్రీవారి దర్శనానికి దూరం చేశా­రని స్థానికులు, స్థానికేతరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో సుమారు 8 లక్షల మంది జనాభా ఉంటే.. కేవలం 15 వేల టికె­ట్లు ఇచ్చి చేతులు దులుపుకోవటం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ ఆంక్షలు విధించి టికెట్లు ఇవ్వక పోవటంపై భక్తులు మండిప­డుతున్నారు. 

వైకుంఠ ద్వారా దర్శనాల నేపథ్యంలో ప్రొ­టో­కాల్‌ ప్రముఖులకు మి­నహా వీఐపీ దర్శ­నా­ల­ను టీటీడీ రద్దు చేసినట్లు ప్రక­టించింది. అయి­తే టీడీపీ, బీజేపీ, జన­సేన నేతలు ఎవరికి వారు కుటుంబాలతో సహా వైకుంఠ ద్వార దర్శనా­నికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకు­న్నట్లు విశ్వ­సనీయ సమాచారం. 

కాగా, గత వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వ హయాంలో వైకుంఠ ఏకాదశి సమ­యంలో తిరుపతిలో భారీ ఏర్పాట్లు చేసి, నేరు­గా భక్తులకు టోకెన్లు పంపిణీ చేశారు. క్యూలై­న్‌లో వచ్చిన వారు వచ్చినట్లు టోకెన్లు తీసు­కుని వెళ్లేవారు. స్థానికులతో పాటు అలా ఎంతో మందికి శ్రీవారి దర్శన అవకాశం కలిగింది.

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)