Breaking News

యర్రగొండపాలెం : RO శ్రీలేఖ చౌదరీపై ఈసీ వేటు

Published on Fri, 05/31/2024 - 05:29

యర్రగొండపాలెం: సార్వత్రిక ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించి వివాదాస్పద అధికారిగా మారిన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ రిట­ర్నింగ్‌ అధికారి (ఆర్వో) పి.శ్రీలేఖ చౌదరీపై ఎన్నికల కమిషన్‌ వేటు వేసింది. ఆమెను ఆర్వో బాధ్యతల నుంచి తప్పిస్తూ బుధవారం రాత్రి ఆదేశాలు జారీ­చేసింది. వెలిగొండ ప్రాజెక్టు ప్రత్యేకాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ఆమెకు ఎన్నికల కమిషన్‌ యర్రగొండపాలెం నియోజకవర్గ ఆర్వో బాధ్యతలు అప్పచెప్పింది. బాధ్యతలు  చేపట్టిన నాటి నుంచి వైఎస్సార్‌సీపీని టార్గెట్‌గా చేసుకుని ఆమె తీసు­కున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. 

ప్రజ­లకు నీళ్లు సరఫరా చేసి పక్కన పడేసిన పాత ట్యాంకర్లపై ఉన్న సీఎం జగన్‌ బొమ్మతో కూడిన స్టిక్కర్లను సైతం ఆమె వదల్లేదు. అలాగే, నిబంధనల ప్రకారం వైఎస్సార్‌సీపీ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు, స్టిక్కరింగ్‌లను సైతం ఆమె తొలగింపజేశారు. కానీ, అదే సమయంలో టీడీపీ కార్యాలయం వద్ద ఉన్న ఫ్లెక్సీలు, జెండాలను తొలగించేందుకు ఆమె శ్రద్ధ వహించలేదు. 

బస్టాండ్‌కు సమీపంలో జెండా కర్రపై బహిరంగంగా కనిపిస్తున్న ఆ పార్టీ చిహ్నం, అక్కడికి సమీపంలోని బీజేపీ కార్యాలయంపై ఉన్న బోర్డు, జెండాలను పట్టించుకోలేదు. పత్రికల్లో వార్తలు వచ్చినా ఆమె పట్టనట్లు వ్యవహరించారు. ఇదేంటని వైఎస్సార్‌­సీపీ నాయకులు ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు దిగారు. టీడీపీ, బీజేపీ ఫ్లెక్సీలు, జెండాలపై వివాదం చెలరేగడంతో వాటిని తొలగించారు. 

ఇక శ్రీలేఖ పచ్చనేతల ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చారని, ఆర్వో కార్యాలయంలో జరిగే ప్రతి సమాచారం టీడీపీ నేతలకు చేరవేసే వారని ఆమెపై ఆరోపణలున్నాయి. ఎన్నికల ప్రచారం సమయంలో స్టిక్కర్లు పంచారని, భోజనాలు పెట్టించారని వైఎస్సార్‌సీపీ ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై ఒక కేసు, ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌పై మూడు కేసులు, చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్‌ నర్రెడ్డి వెంకటరెడ్డిపై మూడు కేసులు నమోదు చేశారు. 

గ్లాసు గుర్తుపై తెరవెనుక మంత్రాంగం..
ఇక నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఒక ఇండి­పెండెంట్‌ అభ్యర్థికి గ్లాస్‌ గుర్తును కేటాయించాల్సి వచ్చింది. గత నెల 29న నామినేషన్ల ఉపసంహరణ సమయంలో ఆమె చివరివరకూ స్వతంత్ర అభ్యర్థు­లతో చర్చలు జరిపారని, ఆర్వో కార్యాలయం కేంద్రంగా చివరివరకూ నాటకీయ పరిణామాలు చోటు­చేసుకున్నాయని ఆరోపణలు గుప్పుమ­న్నా­యి. 

గాజు గ్లాస్‌ గుర్తు కేటాయిస్తే టీడీపీ అభ్యర్థికి ఇబ్బందులు ఎదురవుతాయని, ఆ పార్టీ నుంచి ఒత్తిళ్ల మేరకు ఆమె స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకునేలా చేశారని ఆరోపణలొచ్చాయి. ఈవీఎంలో కూడా ఆ గుర్తు కనిపించకుండా చేశారన్న విమర్శలున్నాయి. 

పోలింగ్‌ సమయంలో కూడా ఆర్వో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే నియోజక­వ­ర్గంలోని అనేక గ్రామాల్లో అర్ధరాత్రి 12 గంటల నుంచి వేకువజామున 3గంటల వరకు పోలింగ్‌ నిర్వహించాల్సి వచ్చింది. ఎక్కువగా టీడీపీకి అనుకూలంగా ఉన్న గ్రామాలు కావడంతో పోలింగ్‌ కొనసాగిస్తూ వచ్చారని విమర్శలు వెల్లువెత్తాయి.

పచ్చ పత్రికలో అసత్య కథనం
ఒంగోలు పార్లమెంట్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి బెదిరింపులకు గురైన మహిళా ఆర్వోపై వేటు.. అంటూ పచ్చపత్రిక ఈనాడులో ప్రచురితమైన కథనంలో ఏమాత్రం నిజంలేదని పలువురు ఖండించారు. ఎన్నికల సమయంలో ఆర్వోతో అభ్యర్థులు కలిసి మాట్లాడటం సహజమని.. అంతమాత్రాన బెదిరించారని ఆరోపించడం సరికాదని వారంటున్నారు. 

ఎన్నికల నిర్వహణ సక్రమంగా నిర్వహించలేక పోయారని, కౌంటింగ్‌ నిర్వహణ కూడా అదే విధంగా ఉండవచ్చన్న ఉద్దేశంతో ఆమెను విధుల నుంచి తప్పించి ఉంటారని వారు అభిప్రాయపడుతున్నారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)