Breaking News

రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. 17 రైళ్లు రద్దు

Published on Fri, 05/19/2023 - 07:59

సాక్షి, హైదరాబాద్‌/విజయవాడ: చర్లపల్లి టెర్మినల్‌ వద్ద ఆర్‌యూసీ నిర్మాణ పనుల దృష్ట్యా ఈ నెల 21న ఆ మార్గంలో నడిచే 17 రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సికింద్రాబాద్‌ నుంచి వరంగల్, రేపల్లె, సిర్పూర్‌ కాగజ్‌గర్, కాచిగూడ నుంచి మిర్యాలగూడ, వికారాబాద్‌ నుంచి గుంటూరు మధ్య నడిచే పలు రైళ్లు రద్దు కానున్నాయి.

విశాఖ–కాచిగూడ సూపర్‌ ఫాస్ట్‌ రైలు పొడిగింపు
రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): విశాఖపట్నం–కాచిగూడ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌­ప్రెస్‌ రైలును ఈ నెల 20 నుంచి మహబూబ్‌నగర్‌ వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ మేరకు కాచిగూడ–విశాఖ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌(12862) 20వ తేదీన మహబూబ్‌నగర్‌లో సాయంత్రం 4.10 గంటలకు బయల్దేరుతుంది. 6.10కి కాచిగూడ చేరుకుని సాయంత్రం 6.20కి బయల్దేరి, మరుసటిరోజు ఉదయం 6.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(12861) విశాఖలో సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.45కి కాచిగూడ చేరుకుంటుంది. తిరిగి 6.55కి బయల్దేరి ఉదయం 9.20 గంటలకు మహబూబ్‌నగర్‌ చేరుకుంటుంది.
చదవండి: మండుతున్న సూరీడు.. ఆ జిల్లాలో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)