వైఎస్సార్‌సీపీకి ఓటేశారని సామాజిక బహిష్కరణ!

Published on Fri, 05/17/2024 - 05:24

వినుకొండ (నూజెండ్ల): పోలింగ్‌ ముగిసినప్పటికీ టీడీపీ నేతల ఆగడాలకు అంతూ పొంతూ లేకుండా పోతున్నది. వైఎస్సార్‌ సీపీకి ఓటు వేశారని ఓ ఎస్సీ కాలనీ వాసులను సామాజిక బహిష్కరణ చేయడమే ఇందుకు సాక్షీభూతంగా నిలుస్తున్నది. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం గురప్పనాయుడిపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశారని గ్రామంలో మంచినీటి ప్లాంట్‌ వద్దకు రానివ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని కాలనీ వాసులు వినుకొండ ఎమ్మెల్యే బొల్లాబ్రహ్మనాయుడును గురువారం కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. 

అనంతరం గ్రామానికి చెందిన మాశిపోగు వసంతరావు, దూపాటి లింగయ్య, పాలెపోగు యోబు, మాణిక్యరావుతోపాటు పలువురు కాలనీ వాసులు మీడియాతో  మాట్లాడారు. ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రామంలోని వాటర్‌ ప్లాంట్‌ వద్ద తాగునీరు పట్టుకోవడానికి వీలులేదని,  పొలం పనులకు పిలవబోమని, కౌలుకు భూములు ఇవ్వబోమని, కులం పేరుతో దూషిస్తూ టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయమై ఎస్సీ కమిషన్‌ తో పాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.  

సామాజిక బహిష్కరణ చేయడం దారుణం : ఎమ్మెల్యే బొల్లా  
గురప్పనాయుడు పాలెం ఎస్సీ కాలనీ వాసులకు తాగునీరు ఇవ్వకుండా, పనులకు పిలవకుండా బహిష్కరించడం దారుణమని ఎమ్మెల్యే బొల్లా అన్నారు.  కాలనీ వాసులకు అండగా ఉంటామని తెలిపారు. గ్రామంలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)