Breaking News

సోషల్‌ మీడియా.. మార్కెట్‌ మేనియా

Published on Sun, 07/28/2024 - 04:28

విస్తృతమవుతున్న ప్రకటనల మార్కెట్‌ 
⇒ 2024 మార్చి నాటికి సోషల్‌ మీడియాలో వ్యాపార ప్రకటనల మార్కెట్‌: రూ. 10 వేల కోట్లు. 
⇒   2027 నాటికి సోషల్‌ మీడియాలో వ్యాపార ప్రకటనల మార్కెట్‌ (అంచనా): రూ. 14 వేల కోట్లు. 
⇒  ఏదో ఒక బ్రాండు, బ్రాండ్‌ అంబాసిడర్‌ను అనుసరిస్తున్న సోషల్‌ మీడియా ఖాతాదారులు: 90 శాతం  
⇒ ప్రకటనను చూసిన వెంటనే కొనుగోలు చేస్తున్న వారు: 11 శాతం 
⇒ ప్రకటనలు చూసి అవే ఉత్పత్తులను బయట స్టోర్స్‌లో కొనుగోలు చేస్తున్న వారు: 21 శాతం  
⇒ దేశంలో సోషల్‌ మీడియాలో వ్యాపార ప్రకటనలపై ఆధారపడుతున్న పెద్ద, మధ్య తరహా వ్యాపార సంస్థలు: 77 శాతం  
⇒ సోషల్‌ మీడియాలో చూసిన వాటిలో కనీసం ఏదో ఒక ఉత్పత్తిని కొనుగోలు చేస్తున్న ఖాతాదారులు: 76 శాతం  
⇒ ప్రకటన చూశాక ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నవారు: 44 శాతం  

సాక్షి, అమరావతి
ప్రస్తుత స్మార్ట్‌ ఫోన్ల యుగంలో ప్రపంచం మొత్తం సోషల్‌ మీడియా చుట్టూ తిరుగుతోంది. ఇక భారత్‌లో అయితే సోషల్‌ మీడియా మేనియా అన్ని దేశాలకన్నా ముందుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియా వినియోగంలో భారత్‌ మొదటిస్థానంలో ఉండగా.. రానున్న రోజుల్లో ఇది మరింత ఉధృతమవుతుందని ఫోర్బ్స్‌ నివేదిక వెల్లడించింది. భారత్‌లో సెల్‌ ఫోన్‌ వినియోగదారులు రోజుకు సగటున రెండున్నర గంటల పాటు సోషల్‌ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది. ఇక పెద్ద పెద్ద వ్యాపార సంస్థల నుంచి చిన్న స్థాయి సంస్థల వరకూ ప్రకటనల ద్వారా తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి సోషల్‌ మీడియానే ఆశ్రయిస్తున్నారు.  

ఇన్‌ఫ్లుయన్సర్స్‌ హవా.. 
ఈ సోషల్‌ మీడియా యుగంలో ఇన్‌ఫ్లుయన్సర్స్‌ హవా కొనసాగుతోంది. కనీసం 10లక్షల మంది ఫాలోయర్లు ఉండే ఇన్‌ఫ్లుయన్సర్స్‌కు డిమాండ్‌ భారీగా ఉంటోంది. వారికి భారీ పారితోషికాన్ని చెల్లించేందుకు పారిశ్రామిక సంస్థలు, రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉంటున్నాయి. యూ ట్యూబ్‌లో 10 లక్షల వ్యూస్‌ వచ్చే వీడియోకు రూ. 3 లక్షలు చొప్పున చెల్లిస్తున్నారు.  

ఫోర్బ్స్‌ నివేదికలో ప్రధాన అంశాలు ఇవీ.. 
⇒ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 500 కోట్ల మంది సోషల్‌ మీడియా ఖాతాదారులు ఉన్నారు. 2027 నాటికి ఈ సంఖ్య 585 కోట్లకు
చేరుతుందని అంచనా.  
⇒ సోషల్‌ మీడియా ఖాతాదారుల్లో అత్యధికంగా భారత్‌లో 42 కోట్ల మంది ఉన్నారు. దేశ జనాభాలో ఇది 40 శాతం సోషల్‌ మీడియా ఖాతాదారులు కావడం గమనార్హం. ఇంటర్నెట్‌ కనెక్షన్లు ఉన్నవారిలో 67 శాతం మంది సగటున కనీసం ఒక సోషల్‌ మీడియా మాధ్యమాన్ని వాడుతున్నారు. 
⇒ భారత్‌లో రోజుకు సగటున 150 నిమిషాల పాటు అంటే రెండున్నర గంటల పాటు సోషల్‌ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. ఈ ప్రకారం 73 ఏళ్లు జీవించే పౌరుడు తన జీవిత కాలంలో 5.7 ఏళ్ల పాటు సోషల్‌ మీడియాలో కాలక్షేపం చేసినట్టు అవుతుందని ఫోర్బ్స్‌ సంస్థ అంచనా వేసింది. 
⇒ దేశంలోని ఖాతాదారుల్లో 78 శాతం మంది తమ మొబైల్‌ ఫోన్‌ ద్వారానే సోషల్‌ మీడియాను వీక్షిస్తున్నారు.  
⇒ భారత్‌లో సోషల్‌ మీడియా వేదికల్లో మొదటి స్థానంలో ఫేస్‌బుక్, రెండో స్థానంలో ఇన్‌స్టాగ్రామ్‌ ఉన్నాయి. 18 ఏళ్లు దాటిన సోషల్‌ మీడియా ఖాతాదారుల్లో 74 శాతం మంది ఫేస్‌బుక్, 71 శాతం మంది ఇన్‌స్టాగ్రామ్‌ మాధ్యమాన్ని అనుసరిస్తున్నారు. కాగా 49 శాతం మంది ఎక్స్‌ను ఫాలో అవుతున్నారు. ఫేస్‌బుక్‌ మరికొన్నేళ్లపాటు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని అంచనా వేశారు. 

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)