Breaking News

అక్రమ నిర్బంధాలపై ఏపీ హైకోర్టు సీరియస్‌.. కీలక ఆదేశాలు జారీ

Published on Fri, 11/08/2024 - 15:24

అమరావతి, సాక్షి: వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా సిబ్బంది అక్రమ నిర్బంధాలపై ఏపీ హైకోర్టు సీరియస్‌ అయ్యింది. ఈ మేరకు బాధిత కుటుంబాలు దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీస్‌ స్టేషన్‌ల నుంచి సీసీటీవీ ఫుటేజీలను సమర్పించాలంటూ ఆ ఆదేశాల్లో పేర్కొంది. 

పోలీస్‌ స్టేషన్‌ల నుంచి సీసీటీవీ ఫుటేజీలు ఇవ్వాలి. ఈ నెల 4 నుంచి ఇవాళ్టి వరకు సీసీ ఫుటేజీలను స్థానిక మెజిస్ట్రేలకు సమర్పించాలి. పౌరస్వేచ్ఛను కాపాడడంలో ఈ కోర్టుకు బాధ్యత ఉంది. చట్టానికి లోబడి వ్యవహరిస్తున్నారా? లేదా?. ప్రొసీజర్‌ ఫాలో కాకపోతే.. భవిష్యత్తులో ఏం చేయాలో చూస్తాం అంటూ ప్రభుత్వానికి ధర్మాసనం హెచ్చరికలు జారీ చేసింది. 

ఉదయం.. హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఇన్నేసి పిటిషన్లు దాఖలు కావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో అసలేం జరుగుతోందంటూ ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. 

మధ్యాహ్నాం భోజన విరామం తర్వాత తిరిగి విచారణ ప్రారంభం కాగా.. ఇవన్నీ తప్పుడు పిటిషన్లని, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేయాలని ధర్మాసనాన్ని అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ కోరారు. అయితే ఇవన్నీ నిజమైన పిటిషనలేనని, బాధిత కుటుంబ సభ్యులే వీటిని వేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో..

ఏజీ విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. అదే టైంలో.. పిటిషన్లు వేసిన వాళ్లందరినీ పోలీసులు వదిలేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు బెంచ్‌ దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఈ వాదనపై న్యాయమూర్తులు అనుమానాలు వ్యక్తం చేశారు. ‘‘మీ మాటలు మేము ఎలా నమ్మాలి. మీరు వదిలేశారు అనడానికి ఆధారాలు ఏంటి?’’ అని ప్రశ్నిస్తూ.. ఆ ఆరుగురు ఎక్కడ ఉన్నారో వెంటనే కనుక్కుని చెప్పాలి’’ని ప్రభుత్వం తరఫున న్యాయవాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే టైంలో పీఎస్‌ల సీసీటీవీ ఫుటేజీలను సమర్పించాలని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను సోమవారానికి(11వ తేదీకి) వాయిదా వేసింది.

YSRCP కార్యకర్తల అరెస్టులు.. ప్రభుత్వ లాయర్లపై హైకోర్టు ఆగ్రహం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)