Breaking News

అధికారమదంపై ‘ధర్నా’గ్రహం

Published on Thu, 02/26/2026 - 04:53

అధికారపార్టీ అడ్డగోలు వేధింపులు, అక్రమ తొలగింపులపై చిరుద్యోగులు నిరసన గళమెత్తారు. రాష్ట్ర నలుమూలల 
నుంచీ తరలివచ్చి బెజవాడలో కదంతొక్కారు. రాష్ట్రస్థాయి ధర్నాలో చంద్రబాబు సర్కారు దుర్నీతిపై ధర్మాగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు అమలు చేయాలని, పెండింగ్‌ బకాయిలు చెల్లించాలని దిక్కులుపిక్కటిల్లేలా నినదించారు.  

సాక్షి, అమరావతి/గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌) : క్షేత్రస్థాయిలో పొదుపు సంఘాల కార్యక్రమాలను పర్యవేక్షించే గ్రామ సమాఖ్య సహాయకులు (వెలుగు వీవోఏ – డ్వాక్రా యానిమేటర్లు), మెప్మా రిసోర్స్‌ పర్సన్లు (ఆర్‌పీ)లు బుధవారం విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నా చేపట్టారు. అధికార పార్టీ నేతల పెత్తనం పెరగడంతో పాటు నిబంధనలకు విరుద్ధ కార్యక్రమాల పేరిట  వేధింపులు, అక్రమ తొలగింపులను నిరసించారు. తొలుత రాష్ట్ర నలుమూలల నుంచీ తరలివచ్చిన ఉద్యోగులు విజయవాడ అలంకార్‌ సెంటర్‌లోని ధర్నా చౌక్‌కు చేరుకున్నారు. 

బాబు సర్కారుకు వ్యతిరేకంగా వారు చేసిన నినాదాలతో ధర్నాచౌక్‌ దద్దరిల్లింది. తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు కనీస వేతనాలు వర్తింపజేయాలని, అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో వీవోఏ–యానిమేటర్లతో పాటు ఆర్పీలకు ఇచ్చే నెలవారీ వేతనం రూ.8వేలు, రూ.పదివేలు ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

కనీస వేతనాలు రూ.26 వేల చొప్పున చెల్లించాలని..  హెచ్‌ఆర్‌ పాలసీ అమలు, 10 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం, అర్హులైన వారికి పదోన్నతులు సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. వీవోఏ – యానిమేటర్లకు స్త్రీనిధి ప్రోత్సాహకాలు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని, ఒక్కొక్కరికీ రూ. 30 వేల నుంచి రూ.లక్ష  వరకు రావాల్సి ఉందని వివరించారు. ఆ బకాయిలు వెంటనే చెల్లించాలని నినదించారు.  60 ఏళ్లు నిండిన వీఓఏలకు నిలుపుదల చేసిన వేతనాలు చెల్లించాలని, మెప్మా ఆర్‌పీలకు గ్రేడింగ్‌ విధానం రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. 

ఎన్నికల ముందు హామీ ఇచి్చన మేరకు మహిళలు పొదుపు సంఘాల ద్వారా తీసుకునే రుణాలపై  రూ.10 లక్షల వరకు వడ్డీ రాయితీలు చెల్లించాలని, మహిళా మార్టులు, స్వావలంబన, అభయహస్తం నగదును పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని కోరారు. చిరుద్యోగుల ధర్నాకు సీపీఎం నేత వి. శ్రీనివాసరావు సంఘీభావం ప్రకటించారు. 

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. వారికి న్యాయం జరిగే వరకు మద్దతుగా పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు.  ఇదిలా ఉంటే రాష్ట్ర స్థాయి ధర్నా అనంతరం యూనియన్‌ ప్రతినిధులు సెర్ప్‌ సీఈవో వాకాటి కరుణ, మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌.సురేష్‌ కుమార్‌లను కలిసి 
వినతిపత్రాలను అందజేశారు.

అంగన్‌వాడీల వినూత్న నిరసన
ఏలూరు (టూటౌన్‌): ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్, హెల్పర్‌ పోస్టులు భర్తీ చేయాలని, అంగన్‌వాడీల వేతనాలు పెంచాలని కోరుతూ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూని­యన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్‌ వద్ద తలపెట్టిన నిరాహార దీక్షలు రెండోరోజు బుధవారం కొనసాగాయి. జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది అంగన్‌వాడీలు తరలివచ్చారు. 

కనీస వేతనం రూ.26,000, సంక్షేమ పథకాల అమలు, యాప్స్‌ అన్నీ కలిపి ఒకే యాప్‌గా మార్చాలని, మెనూ చార్జీలు పెంచాలని పెద్దపెట్టున నినదించారు. మోకాళ్లపై నిలిచి నిరసన గళం వినిపించారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.సుభాషిణి, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.రవికుమార్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్‌ , ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు పి.భారతి పాల్గొన్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)