Breaking News

బీసీ మహిళంటూ బాబు బుకాయింపు!

Published on Sat, 07/01/2023 - 03:35

సాక్షి, అమరావతి: కళ్లార్పకుండా అబద్ధాలను వల్లించడంలో తాను గోబెల్స్‌ను మించిపోయిన విషయాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరో­సారి రుజువు చేసుకున్నారు! టీడీపీ అనుబంధ విభాగం ఐ–టీడీపీని వికృత పోస్టులకు అడ్డాగా మార్చేసిన ఆయన అసభ్యకర పోస్టులు పెట్టే శ్వేతా చౌదరి అలియాస్‌ స్వాతిరెడ్డిని నిస్సిగ్గుగా సమర్థించడం విస్మయం కలిగిస్తోంది. పైగా ఆమె బీసీ మహిళా అంటూ బుకాయించడం గమనార్హం. 

స్వాతి రెడ్డి ఎందుకు అయ్యారంటే...
కమ్మ సామాజిక వర్గానికి చెందిన కోట శ్వేతాచౌదరి మారుపేరుతో స్వాతిరెడ్డినంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేయడం వెనుక టీడీపీ పక్కా పన్నాగం దాగుంది. తిరుపతికి చెందిన ఆమె నర్సింగ్‌ కోర్సు చేసి హాస్పిటల్‌  మేనేజ్‌మెంట్‌ చదివేందుకు స్టూడెంట్‌ వీసాపై లండన్‌లో ఉంది. ఐ–టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తోంది.

కువైట్‌ టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగంలో క్రియాశీలకంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్, ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగతంగా అసభ్యకర పోస్టులను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయడమే లక్ష్యంగా ఐ–టీడీపీ ఆమె పేరు, సామాజికవర్గం పేరును మార్చేసింది.

శ్వేతా చౌదరిని ఏకంగా స్వాతి రెడ్డిగా మార్చి సోషల్‌ మీడి­యాలో అకౌంట్‌ తెరిచింది.  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా కించపరుస్తూ అసభ్యకర రీతిలో సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతోంది. ఆమెను నిస్సిగ్గుగా వెనకేసుకు రావడం ద్వారా ఈ కుట్ర వెనుక తాను ఉన్నట్లు చంద్రబాబు చెప్పకనే చెప్పారు!

ఆమె కుటుంబానికీ సంక్షేమ పథకాలు..
ముఖ్యమంత్రి జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్న శ్వేతా చౌదరి అలియాస్‌ స్వాతి రెడ్డి కుటుంబానికి కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోంది. ఆమె తండ్రి కోట విశ్వ­నాథ్‌ ప్రస్తుతం ఆ కుటుంబానికి దూరంగా మదనపల్లిలో మరో మహిళతో కలసి జీవిస్తు­న్నారు.

వారిద్దరికీ రాష్ట్ర ప్రభుత్వం ‘నవరత్నాలు– పేదలు అందరికీ ఇళ్లు’ పథకం కింద విడివిడిగా ఇళ్లను మంజూరు చేసింది. అయితే వారిద్దరూ తమకు పక్కపక్కనే ఇళ్ల స్థలాలను కేటాయించాలని కోరుతున్నారు. శ్వేతాచౌదరి తండ్రి జీవించి ఉన్నప్పటికీ తిరుపతిలో నివసిస్తున్న ఆమె తల్లి లలిత వితంతు పింఛన్‌ పొందుతున్నారు.

Videos

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

Photos

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం