Breaking News

ఏపీ కల్తీ మద్యం కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

Published on Wed, 10/08/2025 - 12:44

సాక్షి, విజయవాడ: నకిలీ మద్యం తయారీ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ మద్యం తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నట్టు పోలీసుల ఎదుట నిందితులు ఒప్పుకున్నారు. నకిలీ మద్యం తయారు చేయుటలో టీడీపీ నేత జనార్థన్‌ రావు, అతని సోదరుడు జగన్‌మోహన్‌రావు ప్రధాన పాత్ర పోషించినట్లు ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.

మద్యం అమ్మకాలలో అధిక లాభాలు ఆర్జించడం కోసమే నకిలీ మద్యం తయారీ విధానం మొదలు పెట్టినట్లు నిందితుడు జగన్‌మోహన్‌రావు ఒప్పుకున్నట్లు అధికారులు రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించారు. నాలుగు నెలల నుంచి మొలకల చెరువు ప్రాంతంలో నకిలీ మద్యం డెన్ మొదలు పెట్టినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో అధికారులు పేర్కొన్నారు. మూడు నెలల క్రితం ఇబ్రహీంపట్నంలో డెన్ ఏర్పాటు చేసి వివిధ వైన్ షాపులు, బెల్ట్ షాపులు, బార్ల లో అమ్మకాలు జరిపినట్టు గుర్తించారు.

హైదరాబాద్‌కి చెందిన రవి అనే వ్యక్తి నకిలీ లేబుళ్లు తయారు చేసినట్టు పోలీసులు గుర్తించారు. మొలకల చెరువులో తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఇబ్రహీంపట్నం తీసికొనివచ్చినట్టు పోలీసులు గుర్తించారు. నకిలీ మద్యం తయారీలో బెంగుళూరుకు చెందిన బాలాజీది కీలక పాత్ర వహించినట్లు పోలీసులు నిర్థారించారు. మద్యం బాటిళ్లకు ఫేక్ సీల్స్ బెంగుళూరు నుంచి బాలాజీ పంపినట్లు పోలీసులు గుర్తించారు.

నకిలీ మద్యం కేసులో  నిందితుల పై U/sec.13 (e), 1 3 (1), 34(a) =/w 34 (a)(1)(ii), 34 (e), 3 4 (f), 34 (h) r/w 34 (2) & 36 (1)(b)& (c), 37, 42, 50, 50(B) of A.P. Excise (Amendment) Act, 2020 OF PROH.& EXCISE సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అచ్చం ఒరిజినల్‌లా ఉండేలా బాటిళ్లపై  సీల్స్ తయారు చేయడంతో అనుమానం రాకుండా మద్యం అమ్మకాలు సాగిస్తున్నట్లు పోలీసుల విచారణ తేలింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)