Breaking News

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు 

Published on Sat, 01/06/2024 - 04:06

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ద.మ రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ రైళ్లను నడుపనున్నారు.  

► సికింద్రాబాద్‌–బ్రహ్మపూర్‌ (07089) ఈ నెల 7, 14 తేదీలలో సాయంత్రం 7.45 గం.లకు  సికింద్రాబాద్‌లో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 11.15 గంటలకు బ్రహ్మపూర్‌ చేరుకుంటుంది.  

► బ్రహ్మపూర్‌–వికారాబాద్‌ (07090) ఈ నెల 8, 15 తేదీలలో మధ్య రాత్రి 12.30 గం.లకు బ్రహ్మపూర్‌లో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 8.30 గం.లకు వికారాబాద్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07091) 9, 16 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు వికారాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15 గంటలకు బ్రహ్మపూర్‌ చేరుకుంటుంది. 

► బ్రహ్మపూర్‌–సికింద్రాబాద్‌ (07092) రైలు 10, 17 తేదీలలో మధ్య రాత్రి 12.30 గంటలకు బ్రహ్మపూర్‌లో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 6.30 గం.లకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. 

► విశాఖపట్నం–కర్నూలు సిటీ (08541) 10, 17, 24 తేదీలలో సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1.25 గంటలకు కర్నూలు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08542) 11, 18, 25 తేదీలలో మధ్యాహ్నం 3.30 గం.లకు కర్నూలులో బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. 

► శ్రీకాకుళం–వికారాబాద్‌ (08547) 12, 19, 26 తేదీలలో సాయంత్రం 5 గంటలకు శ్రీకాకుళంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9 గం.లకు వికారాబాద్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08548) 13, 20, 27 తేదీలలో రాత్రి 8.25 గంటలకు వికారాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు మ«­ద్యాహ్నం 12.15 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది. 

► సికింద్రాబాద్‌–తిరుపతి (02764) 10, 17 తేదీలలో సాయంత్రం 6.40 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.45 గం.లకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02763) 11, 18 తేదీలలో సాయంత్రం 5.15 గం.లకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.55 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. 

► సికింద్రాబాద్‌–కాకినాడ టౌన్‌ (07271) 12న రాత్రి 9 గం.లకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07272) 13న రాత్రి 8.10 గం.కు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, తర్వాత రోజు ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.  

► సికింద్రాబాద్‌–బ్రహ్మపూర్‌ (07093) 8, 15 తేదీలలో సాయంత్రం 7.45 గం.లకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, తర్వాత రోజు ఉదయం 11.15 గం.లకు బ్రహ్మపూర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07094) 9, 16 తేదీలలో మధ్యాహ్నం 12.30 గం.లకు బ్రహ్మపూర్‌లో బయలుదేరి, తర్వాత రోజు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. 

► నర్సాపూర్‌–సికింద్రాబాద్‌ (07251) 10న సాయంత్రం 6 గం.లకు నర్సాపూర్‌లో బయలుదేరి తర్వాత రోజు తెల్లవారుజామున 4.50 గం.లకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07252) 11న ఉదయం 8.30 గం.లకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, అదే రోజు రాత్రి 11.30 గంటలకు నర్సాపూర్‌ చేరుకుంటుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)