‘సాయికృష్ణ కేసును సీబీఐ విచారణకు ఇవ్వాల్సిందే’

Published on Sat, 07/04/2026 - 17:00

విజయవాడ: సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసు విజయవాడలో జరిగిన సర్కారీ హత్య అని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఆ కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలంటే సీబీఐ ఎంక్వయిరీ ఒక్కటే మార్గమన్నారు. సిట్‌ విచారణ, మేజిస్టీరియల్ విచారణ రెండూ కూడా కంటి తుడుపు చర్యలేనన్నారు. అందుచేత సీబీఐతో విచారణ చేయిస్తే దీని వెనుక ఎవరున్నారో బయటకొస్తుందన్నారు మల్లాది విష్ణు.

‘ప్రభుత్వం బహిరంగంగా మేజిస్టీరియల్ విచారణకు వైఎస్సార్‌సీపీ నేతలం హాజరయ్యాం. మాకు అనుమానాలు, అభ్యంతరాలు అన్నీ వినతి పత్రం ఇచ్చాం సీబీఐ ఎంక్వయిరీ చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తుంది’ అని పేర్కొన్నారు.

మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు మాట్లాడుతూ.. ‘ మెజిస్ట్రేరియల్ ఎంక్వయిరీలో మా అభిప్రాయం చెప్పాం. ప్రభుత్వం దొడ్డి దారిన నాగరాజుని బాధ్యుడును చేస్తూ ముగిస్తారని అభిప్రాయం ఉంది. దీని వెనక ఇంకెంతమంది ఉన్నారు బయటికి తీయాలి. వీడియో ఫుటేజ్‌ని బయటకు తీయాలి. స్టేషన్లోనే కాదు మిగతాన్ని ప్రాంతాలకు సిసి పుటిజ్ వెలిగితేయాలి.

మార్కాపురం నుండి విజయవాడ వచ్చేవరకు సీసీ ఫుటేజ్‌ తీయాలి. నాగరాజుకు సీపీ ఆదేశాలు ఇచ్చారా? సీపీకి డిజిపి ఆదేశాలు ఇచ్చారా? డీజీపీకి సీఎం ఆదేశాలు ఇచ్చారా? తెలియజేయాలి. క్రాంతికుమార్ దాంట్లో ఏ చర్యలు ప్రభుత్వం తీసుకోలేదు. కామెంట్లు చేశారని, యూట్యూబ్ అని స్టేషన్లో పెట్టి స్టేషన్లో తిప్పుతున్నారు. తమ సొంత సామాజిక వర్గం లో యువకుడు చనిపోతే డీసీఎం ఎందుకు మాట్లాడలేదు. సాయి కృష్ణ కేసిన పవన్ ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు. ఇది ఈ చంద్రబాబు ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు మానవ హక్కులకు సంబంధించిన విషయం’ అని పేర్కొన్నారు. 

మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ కేసులో మాకున్న అనుమానాలు, అభిప్రాయాలను వినతి పత్రంలో తెలియజేశాం. లాకప్ డెత్ చేయడమే కాదు.. డెడ్ బాడీ మాయం చేశారు. ఈ కేసును భూస్థాపితం చేయడానికి అనేక చర్యలు తీసుకొన్నారు. మే 28వ సాయి కృష్ణ తల్లి  ఫిర్యాదు చేస్తే దాని కూడా పట్టించుకోలేదు జగన్ వచ్చిన తర్వాత కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. 

జగన్ రాకపోతే కేస్ కూడా రిజిస్టర్ చేసేవారు కాదు. హేబియస్ కార్పస్ లో వెతుకుతున్నామని పోలీసుల చెప్పారు. పోలీసులు చట్టంతో చెలగాటం అడుగుతున్నారు. నాగరాజు సెల్ ఫోన్ తీసుకోలేదు. కానిస్టేబుల్ సెల్ ఫోన్స్ నాగపూర్ లో అమ్ముకొన్నామని కబుర్లు చెపుతున్నారు. సెల్ ఫోన్స్ దొరికితే అన్ని దొరుకుతాయాని వేరే కథ రాస్తున్నారు.వాస్తవాలు బయటకి రాకుండా నాగరాజు ని ఇరికించి కేసు క్లోజ్ చేయాలని చూస్తున్నారు. దెబ్బలు తగిలినప్పుడు మాత్రమే మెజిస్టీరియల్ ఎంక్వైరీ వేయాలి.. ఈ కేసు సీబీఐతో విచారణ జరపాలనేది వైఎస్సార్‌సీపీ డిమాండ్‌’ అని స్పష్టం చేశారు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)