Breaking News

తిరుమల ఘాట్‌రోడ్‌లో బస్సు ప్రమాదం

Published on Mon, 01/13/2025 - 15:40

తిరుపతి: తిరుమల ఘాట్‌రోడ్‌లో బస్సు ప్రమాదం(Bus Accident) జరిగింది. భక్తులను తీసుకుని వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ఘాట్‌రోడ్‌లో ప్రమాదానికి గురైంది. బస్సు అదుపు తప్పి, పిట్టగోడను ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు . ఈ ఘటనలో పలువురు భక్తులకు(Several Devotees) గాయాలయ్యాయి.  ఇందులో 10 మంది భక్తులకు తీవ్రగాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించే క్రమంలో ట్రాఫిక్‌ జామ్‌ సమస్య అడ్డంకిగా మారి జాప్యం చోటు చేసుకుంది. 

ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు.. రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. ఫలితంగా కిలోమీటర్‌ మేర ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. అలిపిరి వరకూ ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు  ఎదుర్కొన్నారు.

తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదం
ఈరోజు తిరుమల(Tirumala) లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆపై సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం.

లడ్డూ కౌంటర్లలో 47వ నెంబర్‌ కౌంటర్‌ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కౌంటర్‌లోని కంప్యూటర్‌ యూపీఎస్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ రావడంతోనే ప్రమాదం జరిగినట్లు సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు తిరుమల లడ్డూ కౌంటర్‌ల వద్ద నిత్యం భక్తుల రద్దీ ఉండడం సహజమే.

అయితే ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత.. స్వామివారిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్యలో మార్పు కనిపిస్తోంది. ఈ క్రమంలో లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదంతో ఒక్కసారిగా అలజడి చేలరేగగా.. కాసేపు అక్కడున్న భక్తులు అందోళనకు గురయ్యారు.

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం

చదవండి: తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్సార్‌సీపీ న్యాయపోరాటం

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)