Breaking News

మాజీ ప్రియురాలిపై రౌడీ షీటర్‌ లడ్డూ దాడి

Published on Mon, 04/07/2025 - 13:35

తెనాలి: స్థానిక అయితానగర్‌కు చెందిన రౌడీ షీటర్‌ లడ్డూ, గతంలో తనకు సన్నిహితంగా ఉన్న మహిళపై తీవ్రంగా దాడిచేశాడు. ఆమె ఫిర్యాదుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేసి అరెస్ట్‌ చేశారు. ఆదివారం రాత్రి మేజిస్ట్రేట్ ముందు హాజరుపెట్టగా రిమాండ్‌కు ఆదేశించారు. సముద్రాల పవన్‌కుమార్‌ అలియాస్‌ లడ్డూ.. పట్టణంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ ఎన్నారైపై దాడి చేశాడు. దీంతో పోలీసులు అతడిని  పట్టణ బహిష్కరణ చేశారు. తెనాలి రావొద్దని ఆదేశించారు.

అయినా రహస్యంగా పట్టణానికి రాకపోకలు సాగిస్తున్నాడు. గత అక్టోబరులో బహిరంగంగానే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఆ సంబరానికి కూటమి నేతలు హాజరయ్యారు. ఆ తర్వాత మూడురోజులకే అంటే అదే నెల 28వ తేదీ రాత్రి డెకరేషన్‌ పనులు చేస్తుండే నాజరుపేటకు చెందిన కాకుమాను ఇంద్రజిత్‌ అనే వ్యక్తిపై అయితానగర్‌ సెంటర్లోనే లడ్డూ దాడిచేశాడు. వర్కర్‌ను స్కూటర్‌పై ఇంటిదగ్గర దించి తిరిగి వెళుతున్న ఇంద్రజిత్‌పై అకారణంగా లడ్డూ దాడిచేశాడు. అతడి స్కూటర్‌ తీసుకెళ్లి తగులబెట్టాడు. కూటమి నేతలతో ఉన్న బంధం కారణంగానే లడ్డూ ఇంతకు తెగించాడని అప్పట్లో విమర్శలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు వార్తల్లొకొచ్చాడు.  

దూరంగా ఉంచిందని..  
తెనాలి సమీపంలో ఓ గ్రామానికి చెందిన ఓ మహిళతో లడ్డూకు పాత పరిచయం ఉంది. ఆమె విజయవాడలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. కొంతకాలంగా ఆమె లడ్డూను దూరంగా ఉంచింది. ఆగ్రహం చెందిన లడ్డూ శనివారం తనకోసం విజయవాడ వెళ్లి, తనతో  గొడవ పెట్టుకున్నాడు. ఆమెను అనుసరించి తెనాలి వచ్చి, తర్వాత ఆమె నివసించే గ్రామానికి వెళ్లాడు. ఆమెను ఊరి వెలుపలికి రమ్మని బెదిరించాడు. తన దగ్గరకు వచ్చిన మహిళపై తీవ్రంగా దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఫిర్యాదుతో రూరల్‌ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తర్వాత అరెస్టుచేసి, స్థానిక ప్రైవేటు వైద్యశాలలో పరీక్షలు చేయించారు. ఆదివారం రాత్రి మేజి్రస్టేటు ముందు హాజరుపరచగా రిమాండ్‌కు ఆదేశించారు.రూరల్‌ ఎస్‌ఐ ప్రతాప్‌కుమార్‌ కేసు దర్యాప్తుచేస్తున్నారు.


  

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)