Breaking News

అమెరికాలో రోడ్డు ప్రమాదం

Published on Thu, 10/17/2024 - 04:54

రేణిగుంట/ఓజిలి: అమెరికాలోని రాండాల్ఫ్‌ వద్ద సోమవారం సాయంత్రం జరిగిన కారు ప్రమాదంలో తిరుపతి జిల్లాకు చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతిచెందిన వారిలో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, మరో మహిళ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ భార్య.  కేవీబీపురం మండలం అంజూరుపాళెంలో ప్రభుత్వ పాఠశాలలో హెచ్‌ఎంగా పని చేస్తున్న తొట్టంబేడు మండలం చిట్టత్తూరు గ్రామానికి చెందిన డేగపూడి భాస్కర్‌రెడ్డి,  లత దంపతులకు ఇద్దరు కుమార్తెలు.

శ్రీకాళహస్తి పట్టణంలోని బంగారమ్మ కాలనీలో నివాసం ఉంటున్నారు. పెద్ద కుమార్తె హరిత (30)కు కేవీబీ పురం మండలం కాళంగి ఆదరం గ్రామానికి చెందిన సాయి (32) అనే వ్యక్తితో 2022లో వివాహం జరిగింది. సాయికి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వచ్చింది. అతనితోపాటు ఆమె కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాకు వెళ్లి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో తనకు ఉద్యో­గం కోసం దరఖాస్తు చేసుకుంది. ఆమెకు ఉద్యోగ అవకాశం వచ్చి మరో వారం రోజు­ల్లో ఉద్యోగంలో చేరనుంది.

తొట్టంబేడు మండలం పెద్దకనపర్తికి చెందిన న్యాయ­వాది రమే‹Ùబాబు కుమారుడు శివ (29) సాయికి స్నేహితుడు. ఇతను కూడా అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినర్‌. ఓజిలి మండలం రాజపాళెం గ్రామానికి చెందిన తిరుమూరు రవి, సుదర్శనమ్మ దంపతుల కుమారుడు తిరుమూరు గోపి (30) కూడా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఇతను కూడా సాయికి స్నేహితుడు. సోమవారం సాయంత్రం సాయి, అతని భార్య హరిత, స్నేహితులు శివ, గోపి కలిసి కారులో వెళుతుండగా మరో కారు వీరి కారును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో హరిత, శివ, గోపి మృతి చెందగా.. సాయి తీవ్రంగా గాయపడ్డాడు.

అయ్యో దేవుడా.. రాత్రే వీడియో కాల్‌ మాట్లాడారే..
మృతిచెందిన వారు ప్రమాదం జరిగిన ముందు రోజు రాత్రే తల్లిదండ్రులతో మాట్లాడారు.  ‘అయ్యో దేవుడా.. రాత్రే వీడియో కాల్‌లో నవ్వుతూ మాట్లాడారే. కబుర్లెన్నో చెప్పారే. రోజులో ఒక్కసారైనా మాతో మాట్లాడకుండా ఉండే వారు కాదు.. దేవుడా మా బిడ్డలను తీసుకుపోయావే... మేము ఇంకెట్టా బతికేది’ అంటూ గుండెలవిసేలా తల్లిదండ్రులు రోదిస్తున్నారు. హరిత, శివ మృతదేహాలు ఆదివారానికి స్వగ్రామాలకు రానున్నాయి. కాగా అమెరికాలో జరిగిన ప్రమాదం ఒకే మండలానికి చెందిన ఇద్దరిని పొట్టనపెట్టుకోవడంతో తీవ్ర విషాదం నెలకొంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)