Breaking News

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలన సాగుతోంది

Published on Thu, 06/19/2025 - 05:00

సాక్షి, అమరావతి: సోషల్‌ మీడియా పోస్టులపై పోలీసులు ఒకదాని వెంట ఒకటి పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తుండడాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఏమాత్రం ఖాతరుచేయడం లేదంటూ కర్నూలు జిల్లా మహానందికి చెందిన పండరబోయిన తిరుమల కృష్ణ అలియాస్‌ జగన్‌ కృష్ణ ఈ వ్యాజ్యాన్ని దాఖలుచేశారు. దివ్యాంగుడినైన తనపై రెడ్‌బుక్‌ పాలనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా డజను కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసులు ఈ రెడ్‌బుక్‌ నుంచి స్ఫూర్తి పొంది అమానవీయంగా వ్యవహరిస్తున్నారని తిరుమల కృష్ణ తన పిటిషన్‌లో వివరించారు.

ప్రజలందరినీ ఒకే రకంగా చూస్తానని, భయం, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తానన్న ప్రమాణాన్ని పాలకులు విస్మరించారన్నారు. అలాగే, మీడియాకు చెందిన వ్యక్తులను అరెస్టుచేయడం, మీడియా సంస్థలను తగలబెట్టడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ కూడా రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదన్నారు. సోషల్‌ మీడియా తాను పెట్టిన ఒకేఒక్క పోస్టుపై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదుచేసి, దివ్యాంగుడినైన తనను ఇష్టమొచ్చినట్లు తిప్పుతున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

తదుపరి చర్యలన్నీ నిలిపివేయండి..
ఒకే అంశానికి సంబంధించి పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేయడానికి వీల్లేదని తెలిసి కూడా పోలీసులు ఫిర్యాదులు చేసేలా జనాన్ని ప్రోత్సహిస్తున్నారని, సుప్రీంకోర్టు తీర్పును కూడా పట్టించుకోవడంలేదని తిరుమల కృష్ణ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనపై పోలీసులు నమోదు చేసిన బహుళ ఎఫ్‌ఐఆర్‌లలో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని ఆయన హైకోర్టును కోరారు. 

తనపై కర్నూలు వన్‌టౌన్‌ పోలీసులు నమోదుచేసిన కేసును మొదటి కేసుగా పరిగణించి, మిగిలిన కేసులన్నింటినీ కూడా వాంగ్మూలాలుగా పరిగణించేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. ప్రకాశ్‌సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పోలీసులు ఏమాత్రం ఖాతరుచేయడంలేదన్నారు. పోలీసుల వేధింపులు, అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా రాష్ట్రంలో ఇప్పటివరకు రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిలో పోలీసు కంప్లయింట్స్‌ అథారిటీలను ఏర్పాటుచేయలేదన్నారు. 

రెడ్‌బుక్‌ పాలన వల్ల ఇబ్బందులు పడుతున్న పౌరుల్లో తాను కూడా ఒకడినన్నారు. ప్రజలకు కోర్టులను ఆశ్రయించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేకుండాపోయిందన్నారు. తనపై నమోదు చేసిన కేసుల్లో కొన్నింటిలో బెయిల్‌ పొందానని, మరికొన్ని కేసులను కొట్టేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశానన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరపనుంది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)