ఆర్సీబీ విజయం.. టీజీ, ఏపీలో అభిమానుల వీరంగం

Published on Mon, 06/01/2026 - 10:21

సాక్షి, విజయవాడ/హైదరాబాద్‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2026) ఫైనల్‌ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండో ఏడాది కూడా ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆర్సీబీ ఘన విజయాన్ని నమోదు చేయడంతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరు నగరం అర్ధరాత్రి వేళ బాణసంచా వెలుగులు, టపాసుల శబ్దాలతో దద్దరిల్లిపోయింది. తమ అభిమాన జట్టు వరుసగా రెండు టైటిళ్లు కొట్టడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు సంబురాలు చేసుకున్నాయి. కానీ, పలుచోట్ల అభిమానులు రచ్చ చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది.

విజయవాడ.. 
విజయవాడలో ఆర్సీబీ ఫ్యాన్స్ హంగామా చేశారు. తమ అభిమాన జట్టు గెలవడంతో రోడ్లపైకి వచ్చి ఫ్యాన్స్‌ సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బైకులతో రోడ్లపై ప్రమాదకర ఫీట్స్ చేశారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు యువకులను చెదరగొట్టారు.

 

కర్నూలు..
కర్నూలులో ఆర్బీబీ అభిమానులు వీరంగం సృష్టించారు. ఆర్బీసీ విజయం ఆనందంలో అభిమానులు అరాచకాలకు పాల్పడ్డారు. సంబురాలను శృతి మించే విధంగా నిర్వహించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కర్నూలు రాజ్ విహర్ సెంటర్ చేరుకొని ట్రాఫిక్ బ్యారికేడ్స్‌తో పాటు ప్రైవేటు బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో, అక్కడికి చేరుకున్న పోలీసులు.. వారిని చెదరగొట్టారు.

విశాఖ.. 
విశాఖపట్నంలోని బీచ్ రోడ్డుకు అభిమానులు భారీ సంఖ్యలో పోటెత్తి గెలుపు సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో కొందరు ఫ్యాన్స్ కారు ఎక్కి, జెండాలు ఊపుతూ రోడ్లపై రచ్చ రచ్చ చేశారు.

హైదరాబాద్‌..
హైదరాబాద్‌లోనూ ఆర్సీబీ క్రేజ్ స్పష్టంగా కనిపించింది. ఆ‍ర్సీబీ విజయంతో ట్యాంక్ బండ్ వద్ద వందలాది మంది అభిమానులు గుమిగూడి ‘ఆర్సీబీ.. ఆర్సీబీ’ అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశారు. అభిమానులు భారీ సంఖ్యలో ట్యాంక్‌ బండ్‌ వద్దకు తరలివచ్చారు. 

 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)