Breaking News

తిరుమలలో ఘనంగా రథ సప్తమి వేడుకలు

Published on Sun, 01/25/2026 - 09:48

సాక్షి, తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమల భక్తజన సంద్రంగా మారింది. నేడు (ఆదివారం) రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశం నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రథసప్తమి (సూర్య జయంతి) రోజున ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు కనువిందు చేయనుండటంతో, ఆ అపురూప దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో తిరుమల వీధులన్నీ గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి.

భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతిలో స్లాటెడ్‌ సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేసింది. దీంతో భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని, క్యూలైన్లలో ప్రవేశిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో, ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి అధిక సమయం పడుతోందని సమాచారం. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు ఆహార పానీయాలను అందిస్తున్నారు.

వైభవంగా ఏడు వాహనాల సేవలు
నేటి రథసప్తమి మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు  మలయప్ప స్వామి వారు ఏడు విభిన్న వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ, భక్తులను అనుగ్రహించనున్నారు. 



ఇది కూడా చదవండి: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు