Breaking News

వైఎస్సార్‌సీపీ బీసీ నేతపై హత్యాయత్నం

Published on Wed, 12/03/2025 - 23:01

రాయచోటి అర్బన్‌: వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి శిబ్యాల విజయభాస్కర్‌పై బుధ­వారం రాత్రి హత్యాప్రయత్నం జరిగింది. బాధితుడి భార్య విజయలక్ష్మి తెలియజేసిన వివరాల ప్రకారం దాదాపు 10 మంది వ్యక్తులు ఇంటికి వచ్చి గేటు తీయాలని అడిగారు. గేటు తీసిన భాస్కర్‌పై ఇనుప రాడ్లు, కట్టెలు, ట్యూబ్‌ లైట్లతో విచక్షణారహితంగా దాడి చేయడం ప్రారంభించారు.  కాళ్లు పట్టుకున్నా వదలలేదు. తీవ్రంగా గాయపడి కింద పడిపోయిన తరువాత దుండగులు వీడియో, ఫొటోలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంటనే స్థానికుల సహకారంతో గాయపడిన భాస్కర్‌ను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

మంత్రి అనుచరుల పనే..!
మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి  వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధ­వారం మీడియా సమావేశం ఏర్పాటు చేసినందుకు ఆగ్రహించిన మంత్రి అనుచరులే తనపై దాడి చేసి ఉంటారని విజయభాస్కర్‌ పేర్కొన్నారు. తనకు రాయచోటిలో వేరే శత్రువులు ఎవరూ లేరని తెలియజేశారు. 

హేయమైన చర్య: వైఎస్సార్‌సీపీ 
విజయభాస్కర్‌పై దాడిని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు.  ప్రజాపక్షాన మాట్లాడేవారిని గొంతునొక్కాలన్న అరాచక ధోరణి ఇటీవల రాష్ట్రంలో పెరిగిపోయిందన్నారు. గతంలో బీసీ నాయకులైన మాజీ ఎంపీపీ అంపాబత్తిన రెడ్డెయ్య ఇంటిపై దాడి, మల్లూరు రెడ్డి వరప్రసాద్‌పై దాడిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. 
 


భాస్కర్‌పై దాడిచేసిన నిందితులను గుర్తించి 48 గంటల్లో అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఇది రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరుకు ఒక మచ్చగా మిగిలిపోతుందని పేర్కొ­న్నారు. కాగా భాస్కర్‌పై దాడి దారుణమని పార్టీ బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి షేక్‌ దస్తగిరి ఒక ప్రకటనలో ఖండించారు.  

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)