Breaking News

పరారీలో రామాంజనేయ చౌదరి 

Published on Thu, 07/20/2023 - 05:55

ఒంగోలు టౌన్‌: గిరిజన యువకుడిని చితక బాది, అతడి మీద మూత్రం పోస్తూ సెల్‌ఫోన్లో ఆ దృశ్యాలను చిత్రీకరించిన కేసులో ప్రధాన నిందితుడు మన్నే రామాంజనేయ చౌదరి పరారయ్యాడు. మిగతా నిందితుల్లో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. జూన్‌ 19వ తేదీన ఈ సంఘటన జరగ్గా, వారు తీసిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో పెట్టారు. రామాంజనేయ చౌదరి నెల రోజులుగా పోలీసులకు చిక్కకుండా ఒంగోలు పరిసరాల్లోనే ఒక ప్రతిపక్ష నాయకుడి రక్షణలో ఉన్నట్లు సమాచారం.

ఆ నాయకుడి సలహా మేరకు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్రలో భాగంగా వీడియోను లీక్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఒంగోలుకు చెందిన ప్రధాన నిందితుడు మన్నే రామాంజనేయ చౌదరి, బాధితుడైన మోటా నవీన్‌పై పలు కేసులున్నాయి.ఇద్దరూ దొంగతనాలు, రాబరీ కేసుల్లో జైలుకు కూడా వెళ్లారు. డబ్బు పంపకాల్లో వీరి మధ్య విభేదాలున్నాయి.

నవీన్‌ కొద్దికాలంగా ఓ మైనర్‌ బాలికను వేధించడం మొదలెట్టాడు. ఆ బాలికను ఓసారి కిడ్నాప్‌ చేశాడు. దీంతో నవీన్‌పై పోక్సో కేసు నమోదైంది. ఆ బాలికను అభిలాష్‌ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని కుటుంబ సభ్యులు భావించారు. అయితే, నవీన్‌ ఆ బాలికను వేధిస్తుండడంతో ఆమె సోదరుడు ఈ విషయాన్ని అభిలాష్‌ కు చెప్పాడు. నవీన్‌కు గుణపాఠం చెప్పాలని రామాంజనేయ చౌదరితో కలిసి వారు పథకం రచించారు.

గత నెల 19న ప్రభు, నరేంద్ర ఉరఫ్‌ టిల్లుతో కలిసి రామాంజనేయ చౌదరి నవీన్‌ ఇంటికి వెళ్లాడు. అందరూ అక్కడ మద్యం తాగారు. అనంతరం బాలిక విషయంలో రాజీ చేసుకుందామని చెప్పి నవీన్, అతడి సోదరుడు రాజాను తీసుకెళ్లారు. ముక్తినూతలపాడు సమీపంలో కల్వరి టెంపుల్‌ వద్దకు రాగానే అక్కడ కాపు కాసి ఉన్న అభిలాష్‌, బాలిక సోదరుడు, మరో నలుగురు ఇనుప రాడ్లు, కర్రలతో నవీన్, రాజాను చితక్కొట్టారు.

నెత్తురోడుతున్న అతనిపై రామాంజనేయ చౌదరి మూత్రం పోశాడు. ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. వారి నుంచి తప్పించుకున్న రాజా తల్లికి సమాచారమిచి్చ, సమీపంలోని పొగాకు కూలీల సహాయంతో 108లో నవీన్‌ను జీజీహెచ్‌కు తరలించారు. 
 

ఆరుగురు నిందితులను అరెస్టు చేశాం: ఎస్పీ 
ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ మలికా గర్గ్‌ బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. మర్లపాడుకు చెందిన రాయపాటి అభిలాష్, ఒంగోలు గోపాల్‌ నగర్‌కు చెందిన అప్పనబోయిన జయశంకర్, ఇస్లాంపేటకు చెందిన షేక్‌ సాదిక్‌ గపూ ర్‌తో పాటు బాలిక సోదరుడు, అతని స్నేహితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. రామాంజనేయ చౌదరి, చాపల ప్రభు, ఏకాంబరం నరేంద్ర పరారీలో ఉన్నారని చెప్పారు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)