దారి మళ్లించేందుకే అవాస్తవాలు ప్రచారం

Published on Tue, 09/12/2023 - 03:59

సాక్షి, అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొ­రేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణంలో పూర్తి ఆధారాలతోనే కేసు నమోదు చేసి మాజీ సీఎం చంద్రబాబును అరెస్టు చేశామని సీఐడీ వర్గా­లు పేర్కొన్నాయి. ఈ కేసు దర్యాప్తు ప్రక్రి­య­లో అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్‌ వాంగ్మూలం కేవలం ఒక భాగం మాత్ర­మేనని  స్పష్టం చేశా­యి.అన్ని కోణాల్లో పరిశోదించి పూర్తి ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించాయి. తన వాంగ్మూ­లంతోనే చంద్ర­బాబును సిట్‌ అరెస్టు చేశారని చెప్పడం హాస్యా­స్ప­ద­మని, పూర్తిగా ఫైళ్లు చూడ­కుండా ఆయన్ని ఎలా అరెస్ట్‌ చేస్తారని, తాను అప్రూవర్‌గా మారలేదని పీవీ రమేశ్‌ మీడియాలో చేసిన వ్యాఖ్యలను సీఐడీ వర్గాలు ఖండించాయి.

 సిట్‌ విచార­ణను ప్రభావితం చేసే ఉద్దే­శంతో ఆయన అవాస్తవాలను ప్రచా­రంలోకి తెస్తున్నా­రని పేర్కొంది. నిబంధన­లకు విరు­ద్ధంగా డిజైన్‌ టెక్‌ కంపెనీకి ప్రభుత్వ నిధులు మంజూరు చేయడాన్ని అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత అభ్యంతరం తెలిపా­రని సిట్‌ వర్గాలు వెల్లడించాయి.ఆమె అభ్యంతరా­లను బేఖాతర్‌ చేస్తూ చంద్రబాబు ఆదేశా­లతో నిధులు విడుదల చేస్తున్నట్లు పేర్కొంటూ పీవీ రమేశ్‌ డిజైన్‌ టెక్‌ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేశారని సిట్‌ తెలిపింది.

అధికార దుర్వినియోగానికి పాల్ప­డి రూ.371 కోట్ల ప్రజాధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా షెల్‌ కంపెనీల ద్వారా మళ్లించినట్లు దర్యాప్తులో ఆధారాలతో సహా నిర్ధా­రణ అయ్యిందని పేర్కొంది.దర్యాప్తు కీలక దశలో ఉన్న తరుణంలో పీవీ రమేశ్‌ ఉద్దేశపూ­ర్వకంగానే మీడియా ద్వారా అవాస్త­వా­లను ప్రచారంలోకి తెస్తున్నారని సిట్‌ స్పష్టం చేసింది. ప్రజల్ని అయోమయానికి గురి చేయడంతో­పాటు దర్యాప్తును తప్పుదారి పట్టించాల­న్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందని వ్యాఖ్యా­­నించింది.

 పీవీ రమేశ్‌ చెబుతు­న్న­ట్లుగా హాస్యా­స్పదంగానో పేలవంగానో ఈ కేసును దర్యాప్తు చేయడం లేదని సిట్‌ పేర్కొంది. పక్కా ఆధా­రాలతో నిబంధనలకు అనుగుణంగా దర్యాప్తు చేస్తున్నందునే చంద్రబాబు అరెస్ట్‌ను న్యాయ­స్థానం సమ­ర్థించి ఆయనకు రిమాండ్‌ కూడా విధించిందని సీఐడీ వర్గాలు తెలిపాయి.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)