Breaking News

వలపు వలలో త్రిబుల్‌ స్టార్‌ అధికారి!

Published on Thu, 01/30/2025 - 14:04

సాక్షి, వైఎస్‌ఆర్‌ జిల్లా : ‘కంచె చేను మేసింద’న్న చందంగా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పులివెందుల సబ్‌ డివిజన్‌లో యథేచ్ఛగా ఇలాంటి ఘటనలు తెరపైకి వస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల అండదండలు ఉంటే చాలు ఎలాంటి అడ్డదారులు ఎంచుకున్నా పర్వాలేదన్న ధోరణి అధికంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో అసలైన హత్యాయత్నం కేసులు నీరు గార్చడం, వాదులాటలపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం సర్వసాధారణమవుతోంది. అందులో భాగంగా మోట్నూతలపల్లెకు చెందిన గంగాధర్‌ ఆత్మహత్య వెలుగులోకి వచ్చింది.

తెరవెనుక చక్రం తిప్పిన మహిళ..
పులివెందుల మండలం మోట్నూతలపల్లి గ్రామానికి చెందిన గంగాధర అనే వ్యక్తి మంగళవారం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిందే. ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తే విస్తు పోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. మృతి చెందిన గంగాధర్‌కు ఓ మహిళకు మధ్య విభేదాలున్నాయి. సదరు మహిళకు త్రిబుల్‌ స్టార్‌ అధికారితో కొద్దికాలంగా సాన్నిహిత్యం ఉన్నట్లు సమాచారం. ఆమె విభేదాలతో నిమిత్తం లేకుండా మరో చిన్న కొట్లాటలో గంగాధర్‌ చిక్కుకున్నాడు. అంతే తెరవెనుక సదరు మహిళ చక్రం తిప్పింది. అంతే వేగంగా గంగాధర్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. అంతటితో పోలీసు అధికారుల చర్యలు ఆగిపోలేదు. త్రిబుల్‌ స్టార్‌ అధికారితో సాన్నిహిత్యం ఉన్న మహిళను సంతృప్తి పర్చేందుకు గంగాధర్‌కు పోలీసుల వేధింపులు అధికమయ్యాయి. వెరసి పోలీసుస్టేషన్‌ ఎదుటే పురుగుల మందు తాగి చనిపోవడం గమనార్హం.

గతంలోనూ లైంగిక ఆరోపణలు..
ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు త్రిబుల్‌ స్టార్‌ అధికారి గతంలో రాయచోటి ప్రాంతంలో పనిచేస్తుండగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారు. తన కింది స్థాయి సిబ్బంది కుటుంబ సభ్యురాలితో సాన్నిహిత్యం కొనసాగించారు. ఈ విషయం తెలుసుకున్న సదరు సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. తర్వాత కాలంలో సైతం ఆమెతో సాన్నిహిత్యం కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పటికీ సంబంధబాంధవ్యాలు కొనసాగుతున్నట్లు సమాచారం. సదరు మహిళకు రాయచోటిలో ఏకంగా ఇల్లు నిర్మిస్తున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ ఇంటి నిర్మాణానికి పులివెందుల టీడీపీ నాయకులు చేస్తున్న అనైతిక కార్యకలాపాల ద్వారా లభించే సొమ్ము వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

గంగాధర్‌ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకునే దిశగా.. 
పులివెందులలో పోలీసు స్టేషన్‌ ఎదుట ఆత్మహత్య చేసుకున్న మోట్నూతలపల్లె గంగాధర్‌ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో త్రిబుల్‌ స్టార్‌ అధికారి నిమగ్నమైనట్లు సమాచారం. గంగాధర్‌ మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు మంగళవారం సాయంత్రం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా చేపట్టారు. దాంతో బిత్తర పోయిన సదరు అధికారి మొత్తం వ్యవహారం బహిర్గతమవుతుందని నోట్ల కట్టలతో నోరు మూయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర హోంమంత్రి అనిత మాత్రం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు,  చట్టాన్ని అతిక్రమించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించమని నిత్యం ప్రకటిస్తుంటారు. అయితే పోలీసుశాఖకు ఎలాంటి మచ్చ తెచ్చినా టీడీపీ నేతల సిఫార్సులుంటే ఎలాంటి చర్యలు ఉండవని పులివెందుల సబ్‌ డివిజన్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న పలు ఉదంతాలు చెప్పకనే చెబుతున్నాయి. 

ఎస్పీ గాడిలో పెడతారా?!
జిల్లాలో కొంతమంది పోలీసు అధికారులు ఖాకీ వనంలో కలుపు మొక్కలుగా తయారయ్యారు. చట్టాన్ని పరిరక్షించాల్సింది పోయి వారే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అక్రమ ఆదాయం కోసం అర్రులు చాస్తూ, ఈజీ మనీ కోసం అడ్డదారులు ఎంచుకున్నారు. అధికార పార్టీ నేతల అండదండలు ఉంటే చాలు ఉద్యోగ నిర్వహణ ఎలా ఉన్నా ఇబ్బంది లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా నూతన ఎస్పీగా ఈజీ అశోక్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టారు. మొత్తం వ్యవస్థకే మచ్చ తెస్తున్న కలుపు మొక్కలను.. కళంకితులను గాడిలో పెట్టా ల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.  మరి జిల్లా పోలీసు బాసు ఏమేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)