Breaking News

సాక్షి ఎడిటర్‌ ధనంజయరెడ్డికి మళ్లీ ప్రివిలేజ్‌ కమిటీ నోటీసులు

Published on Thu, 11/13/2025 - 04:40

సాక్షి, అమరావతి: ‘సాక్షి’పై చంద్రబాబు సర్కారు కత్తిగట్టింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండ­గడుతోందని కక్షసాధిస్తోంది. కేసులు, నోటీసుల పరంపరను కొనసాగిస్తోంది. ఎలాగైనా సాక్షి గొంతు నొక్కాలని శతవిధాలా యత్నిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణ సదస్సు రద్దు, దానికి సంబంధించిన లోటుపాట్లపై గతంలో సాక్షి పత్రిక రాసిన కథనంపై ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి, చీఫ్‌ రిపోర్టర్‌కి శాసనసభ వ్యవహారాల కార్యదర్శి సభా ఉల్లంఘన నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సాక్షి ఎడిటర్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయమూ తెలిసిందే. హైకోర్టు ఆదేశాల తర్వాతా కూటమి సర్కారు వేధింపులు ఆపలేదు. 

తాజాగా ఎడిటర్‌ ధనంజయరెడ్డి, చీఫ్‌ రిపోర్టర్‌కు శాసనసభ వ్యవహారాల కార్యదర్శి ద్వారా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21వ తేదీ ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని అసెంబ్లీ కమిటీ హాలులో ప్రివిలైజ్‌ కమిటీ ముందు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. పత్రికలో రాసిన పలు కథనాలకు సంబంధించి గతంలో ఎప్పుడూ లేని విధంగా నేరుగా కేసులు నమోదు చేయడం, విచారణ పేరుతో సాక్షి కార్యాలయాలకు తరచూ పోలీసులను పంపి ఇబ్బందులకు గురి చేయడం ద్వారా ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోంది. 

ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చేలా ఎడిటర్‌ ధనంజయరెడ్డి, రిపోర్టర్లపై కేసులు నమోదు చేయడం, విచారణ పేరుతో సాక్షి కార్యాలయాలకు వచ్చి బెదిరింపులకు పాల్పడడంపై జర్నలిస్టు, ప్రజా సంఘాల నుంచి ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తుతున్నా.. చంద్రబాబు సర్కారు క్షక్షసాధింపు పంథాను వీడడం లేదు. దీనిలోభాగంగానే తాజాగా మళ్లీ ప్రివిలైజ్‌ నోటీసులు జారీ చేయించింది.   

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)