Breaking News

ఏపీఎస్‌ ఆర్టీసీకి దండగ.. టీఎస్‌ ఆర్టీసీకి పండుగ!

Published on Mon, 01/19/2026 - 04:05

సాక్షి, అమరావతి: పండుగ ముసుగులో ఓవైపు టీడీపీ నేతలు కోడిపందేలు, కేసినోలు, గుండాట, కోత ముక్కలాట ఆడిస్తూ పండుగ నాలుగు రోజులు రూ.వేల కోట్లు దండుకున్నారు. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయకుండా ప్రైవేటు ట్రావెల్స్‌కు పెద్దపీట వేసింది. ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యాలు ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తుంటే పట్టించుకోకుండా యాజమాన్యాల నుంచి రూ.వందల కోట్లు దండుకుని అవినీతికి కొత్తదారులు తెరిచింది. ఇలా దేన్నీ వదిలిపెట్టకుండా అందినకాడికి టీడీపీ నేతలు దోచుకునేలా చంద్రబాబు ప్రభుత్వం దగ్గరుండి ప్రోత్సహించింది.  మరోవైపు సంక్రాంతికి ఏపీఎస్‌ఆర్టీసీ ముఖం చాటేసింది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ మాఫియా దోపిడీకి కొమ్ము కాసింది. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ మాత్రం సంక్రాంతి సీజన్‌ను సది్వనియోగం చేసుకోవడం గమనార్హం.  

టీఎస్‌ ఆర్టీసీ 6 వేల సర్విసులు 
సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారిలో అత్యధికులు హైదరాబాద్‌ నుంచే బయలుదేరుతారు. అందువల్లే హైదరాబాద్‌ నుంచి ఏపీలో వివిధ ప్రాంతాలకు బస్సు సర్విసులు నడపటంపై నిర్వాహకులు దృష్టి సారిస్తారు. ఏపీఎస్‌ ఆర్టీసీ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం విస్మయపరిచింది. గత కొన్నేళ్లుగా సంక్రాంతి సీజన్‌లో హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు 2 వేలకుపైగా స్పెషల్‌ బస్‌ సర్విసులను తిప్పిన ఏపీఎస్‌ ఆర్టీసీ ఈ ఏడాది మాత్రం కేవలం 200 సర్విసులకే పరిమితం చేసి­నట్లు ప్రకటించడం గమనార్హం. టీడీపీ కూటమి ప్రభుత్వంలో కీలక నేత ఒకరు ప్రైవేటు ట్రావెల్స్‌ మాఫియాతో కుమ్మక్కు కావడమే దీనికి కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సంక్రాంతి సీజన్‌లో టికెట్‌ రేట్లను ఏకంగా ఐదారు రెట్లు అదనంగా పెంచేసి ఏకంగా రూ.2 వేల కోట్ల దోపిడీకి ప్రైవేటు ట్రావెల్స్‌ పన్నాగం పన్నింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక నేత ఒకరు వత్తాసు పలికారు.

ఆయనకు భారీగా ముడుపులు ముట్టజెప్పడమే దీనికి కారణం. దాంతో ఈ ఏడాది ఏపీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్‌ నుంచి సంక్రాంతి స్పెషల్‌ బస్సులకు భారీగా కోత పెట్టింది. కేవలం 200 స్పెషల్‌ సర్వీసులతో చేతులు దులుపుకొంది. దీనిపై తీవ్ర విమర్శలు రేగడంతో ఏటా మాదిరిగానే హైదరాబాద్‌ నుంచి స్పెషల్‌ బస్సు సర్విసులను నిర్వహిస్తామని తూతూమంత్రంగా ప్రకటన చేసి పక్కకు తప్పుకుంది. హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలో ఏ ప్రాంతాలకు ఎన్ని సర్విసులు అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. తద్వారా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ మాఫియాకు టీడీపీ కూటమి ప్రభుత్వం వత్తాసు పలికింది. మరోవైపు సంక్రాంతి సీజన్‌ను పూర్తి స్థాయిలో సది్వనియోగం చేసుకుంటూ టీఎస్‌ ఆర్టీసీ ఏపీకి పెద్ద ఎత్తున బస్సు సర్విసులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు టీఎస్‌ ఆర్టీసీ ఏకంగా 6,430 సంక్రాంతి స్పెషల్‌ సర్విసులను తిప్పడం గమనార్హం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)