Breaking News

విశాఖ నుంచి పాలన: ప్రభుత్వ కార్యాలయాలు .. మిలీనియం టవర్స్‌!

Published on Wed, 10/18/2023 - 07:02

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలో పలు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్నది. ఇందుకోసం వివిధ భవనాలను అధికారుల త్రిసభ్య కమిటీ పరిశీలించినట్లు తెలుస్తున్నది. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం డిసెంబర్‌ నుంచి విశాఖ నుంచి ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు సీఎం జగన్‌ సిద్ధమవుతున్నారు.

ఇందులో భాగంగా మునిసిపల్, ఆర్థికశాఖ ప్రత్యే క ప్రధాన కార్యదర్శులతో పాటు పరిపాలనశాఖ కార్యదర్శులతో కూడిన త్రిసభ్య కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ మిలీనియం టవర్స్‌తో పాటు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను పరిశీలించినట్టు సమాచారం. ప్రధానంగా మిలీనియం టవర్స్‌లో అందుబాటులో ఉన్న 2 లక్షల చదరపు అడుగుల భవనాలను అధికారుల త్రిసభ్య కమిటీ పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇక్కడే ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్టు గుర్తించినట్లు సమాచారం.

అదేవిధంగా గ్రే హౌండ్స్‌లో ఉన్న భవనాలనూ కమిటీ పరిశీలించింది. ఇక్కడ పోలీసుశాఖ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు అవకాశం ఉన్నట్లు ప్రాథ మికంగా నిర్ధా్దరణకు వచ్చారు. వీఎంఆర్‌డీఏ కు చెందిన వివిధ భవనాలను కూడా త్రిసభ్య కమిటీ స్వయంగా పరిశీలించింది. వీఎంఆర్‌డీకు చెందిన భవనాల్లో మునిసిపల్‌శాఖ ఉన్నతాధికారులు.. వైద్యారోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు అరిలోవలోని విమ్స్‌ నుంచి విధులకు హాజరయ్యే అవకాశం ఉందని త్రిసభ్య కమిటీ ప్రాథమికంగా భావించినట్టు సమాచారం. ఇక ఇక్కడకు వచ్చే అధికారులకు అవసరమైన వసతి సౌకర్యాలను మాత్రం ఆయా శాఖలే చూసుకోవాలని కమిటీ   స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
చదవండి: రామోజీ మా సంతకాలు ఫోర్జరీ చేశారు 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)