Breaking News

ప్రైవేట్​పరం కానున్న ఏపీ మెడికల్‌ కాలేజీలు!

Published on Wed, 08/07/2024 - 16:23

అమరావతి, సాక్షి: జగన్‌ పాలనలో జరిగిన మంచిని నాశనం చేయాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో.. ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు  తొలి అడుగు పడింది కూడా. ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్‌ భేటీలో పీపీపీ(Public–private partnership) మోడల్‌ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

జగన్‌ హయాంలో ఏపీలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణం చేపట్టారు. వీటిలో ఐదు మెడికల్‌ కాలేజీలను గతేడాది ఆయన ప్రారంభించగా.. తరగతులు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే మిగిలిన 12 కాలేజీలపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టిసారించింది. వాటిని ప్రైవేట్‌ పరం చేసేందుకు పీపీపీ మోడల్‌ను తెరపైకి తెచ్చింది. పీపీపీ మోడల్‌లో మెడికల్‌ కాలేజీల నిర్వహణకు అధ్యయనం చేయాలని, ఇందుకుగానూ గుజరాత్‌ మోడల్‌ను పరిశీలిస్తామని మంత్రి  పార్థసారథి ప్రకటించారు కూడా. 

రూ.8,480 కోట్లతో 17 కళాశాలలు 
ప్రజలకు ప్రభుత్వ రంగంలో మెరుగైన వైద్య వసతులు సమకూర్చడంపై ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. సుమారు రూ.8,480 కోట్లతో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఈ కాలేజీల ద్వారా ఏకంగా 2,550 ఎంబీబీఎస్‌ సీట్లు కొత్తగా అందుబాటులోకి తేవాలనున్నారు. గతేడాది ఐదు కాలేజీలు ప్రారంభించగా..  ఈ ఏడాది మరో ఐదు, మిగిలిన ఏడు వైద్య కళాశాలలను 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలనుకున్నారు. 

                                      విజయనగరం మెడికల్‌ కాలేజీ ప్రారంభించినప్పటి ఫొటో 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)