Breaking News

హైకోర్టు ఉత్తర్వులకన్నా.. ఎమ్మెల్యే ఆదేశాలే మిన్న!

Published on Sat, 10/11/2025 - 05:49

సాక్షి, అమరావతి: హైకోర్టు ఆగ్రహం, ఆదేశాలను పట్టించుకోకుండా పోలీసులు  గ్రామస్థాయి మొదలుకుని రాష్ట్ర స్థాయి వరకు అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకే నడుచుకుంటున్నారన్న విషయం పలు దఫాలు స్పష్టమవుతూనే ఉంది. ప్రకాశం జిల్లాలో పేరుగాంచిన  శ్రీసిద్ధి భైరవేశ్వరస్వామి ఆలయం ఇందుకు తాజా ఉదాహరణ. గత మూడు దశాబ్దాలుగా ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేసిన కమిటీ పగ్గాలను కూటమి నేతలు బలవంతంగా లాక్కున్నారు.  గుడి తాళాలు, హుండీలు పగలగొట్టారు.

ఈ ఘటనపై వాస్తవ కమిటీ ప్రెసిడెంట్‌ శ్రీరంగారెడ్డి ఈ ఏడాది జూన్‌ 19న ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. పైపెచ్చు ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటూ శ్రీరంగారెడ్డినే వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై శ్రీరంగారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన హైకోర్టు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాచర్ల పోలీసులను ఆదేశించింది. అయినా రాచర్ల పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  హైకోర్టు ఆదేశాల కన్నా అధికార పార్టీ ఎమ్మెల్యే మాటకే పోలీసులు విలువిస్తున్నారు.  

కోర్టు ధిక్కార పిటిషన్‌ల దాఖలు వరకూ పరిస్థితి.. 
దేవస్థానం వ్యవహారాల్లో జోక్యం వద్దని హైకోర్టు ఆదేశించినా వాటిని అమలు చేయకపోవడంతో, శ్రీరంగారెడ్డి రాచర్ల ఏఎస్‌ఐ వై. ఆదిశేషయ్యపై కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఏఎస్‌ఐకు నోటీసులు జారీ అయ్యాయి. అలాగే, ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలని ఇచ్చిన హైకోర్టు ఆదేశాలను అమలు చేయలేదన్న కారణంగా, ప్రకాశం జిల్లా ఎస్‌పీ హర్షవర్ధన్‌రాజు, డీఎస్‌పీ డాక్టర్‌ యు. నాగరాజు, రాచర్ల ఎస్‌హెచ్‌వో పి. కోటేశ్వరరావులపై మరో ధిక్కార పిటిషన్‌ కూడా ఆయన దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై హైకోర్టు వచ్చే వారం విచారణ చేపట్టే వీలుంది.  

మరో కుట్రకు శ్రీకారం 
కోర్టు ధిక్కరణ పిటిషన్లు విచారణకు వస్తున్న తరుణంలోనే  శ్రీరంగారెడ్డి, ఆయన సోదరుడు నెమిలిరెడ్డి­ని లక్ష్యంగా చేసుకుంటూ రాచర్ల పోలీసులు తా­జా­గా కేసు నమోదు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దేవస్థానానికి సంబంధించి­న ఆభరణాలను తీసుకున్నారన్నది ఈ కేసు సారాంశం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)