Breaking News

పోలీసు జులుం.. మాజీ మంత్రి అంబటిపై కేసు

Published on Thu, 06/05/2025 - 09:14

లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్‌): మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై గుంటూరు పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. వైఎస్సార్‌సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా అంబటి రాంబాబు సిద్ధార్థ్‌నగర్‌లోని తన నివాసం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీగా కలెక్టరేట్‌కు బయల్దేరగా పోలీసులు అడుగడుగునా అడ్డుకోబోయారు. ర్యాలీ స్థంబాలగరువు, పట్టాభిపురం మీదుగా మూసేసిన జూట్‌ మిల్లు వద్దనున్న సబ్‌ స్టేషన్‌కు చేరుకోగా.. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ, సిబ్బంది అడ్డుకునే యత్నం చేశారు. దీంతో అంబటి రాంబాబు స్పందించారు.

ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెళ్తుంటే అడ్డుకోవడం సరికాదని చెప్పారు. అంతమాత్రానికే సీఐ వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబుతో దురుసుగా ప్రవర్తించారు. ర్యాలీగా వెళ్లడానికి వీల్లేదని, ర్యాలీగా నువ్‌ ఎలా వెళ్తావో చూస్తా అంటూ మీదమీదకు వెళ్లి గట్టిగా మాట్లాడడం ప్రారంభించారు. ‘మర్యాదగా మాట్లాడు’ అని అంబటి సూచించగా.. ‘నువ్వు పళ్లు కొరుకుతున్నావ్‌’ అంటూ అంబటికి వేలు చూపించారు. ఏకవచనంతో వాగ్వాదానికి దిగారు. దీంతో సిబ్బంది కలుగజేసుకుని అంబటి, సీఐకి సర్దిచెప్పి పంపించారు. 

అనంతరం రాంబాబు పార్టీ నాయకులతో కలిసి కంకరగుంట ఓవర్‌ బ్రిడ్జి మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుని వినతిపత్రం అందజేశారు. కాగా, మాజీ మంత్రి అంబటి పట్ల సీఐ వ్యవహరించిన తీరు సోషల్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియాలో స్పష్టంగా కనిపించింది. ఎల్లో మీడియాలో మాత్రం కలెక్టరేట్‌లోకి అనుమతించలేదని సీఐతో అంబటి దురుసుగా ప్రవర్తించారంటూ దుష్ప్రచారం చేశారు. 

ఘటన జరిగింది జూట్‌ మిల్లు వద్ద అయితే కలెక్టరేట్‌ ముందు అని బురదజల్లాలని చూశారు. చివరకు పోలీసు విధులకు ఆటంకం కలిగించారని, అనుమతి లేకుండా ర్యాలీ తీశారంటూ పలు సెక్షన్లతో అంబటిపై కేసు నమోదు చేయడం గమనార్హం. నిబంధనలను అతిక్రమించిన పోలీస్‌ అధికారిని వదిలేసి అంబటిపై కేసు పెట్టడాన్ని విశ్లేషకులు తప్పుపడుతున్నారు. 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)