Breaking News

‘దారి’తప్పిన పోలీసులు.. మూడ్‌ బాగోలేదంటూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌పై దాడి

Published on Tue, 01/14/2025 - 14:04

సాక్షి, అనంతపురం: జిల్లాలో పోలీసులు దారి తప్పారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌పై దాష్టీకం చూపారు. సమాచారం అడిగితే విచక్షణారహితంగా దాడి చేసిన పోలీసుల వైనం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. అనంతపురం నగరానికి చెందిన యువకుడు ఇంతియాజ్ అహ్మద్ బెంగళూర్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అనంతపురం ఆర్టీవో కార్యాలయం వద్ద నివసించే ఇంతియాజ్ ఇంట్లో చోరీ జరిగింది. ఇదే సమయంలో తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారు.

తల్లికి ఇడ్లీ తెచ్చేందుకు సూర్యా నగర్ రోడ్డులోని ఓ హోటల్‌కు వెళ్లారు. ఇదే సమయంలో కానిస్టేబుల్ నారాయణస్వామి, హోం గార్డు దాదాపీర్ కనిపించడంతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఇంతియాజ్ వారితో మాట్లాడారు. తన ఇంట్లో చోరీ జరిగిందని.. తాను ఉన్న ఇళ్లు ఏ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందని కానిస్టేబుల్ నారాయణస్వామిని అడిగారు. తన మూడ్ బాలేదని... తాను ఎలాంటి సమాచారం ఇవ్వలేనని కానిస్టేబుల్ నారాయణస్వామి..  ఇంతియాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగక అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు కానిస్టేబుల్. విచారించాల్సిన హోంగార్డు కూడా కానిస్టేబుల్ నారాయణస్వామికి మద్దతు ఇవ్వటంతో ఇద్దరూ కలిసి ఇంతియాజ్ పై దాడి చేసి కొట్టారు. అనంతపురం పోలీసుల దాష్టీకం సీసీ కెమెరాలలో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

పోలీసుల చేతిలో గాయపడిన ఇంతియాజ్ అహ్మద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అండగా నిలిచారు. అకారణంగా దాడి చేసిన పోలీసులపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని అనంతపురం మేయర్ మహమ్మద్ వాసీం, ఇతర పార్టీ నేతలు డీఎస్పీ కి ఫిర్యాదు చేశారు.

అనంతపురం జిల్లాలో పోలీసుల వైఖరి రోజు రోజుకూ వివాదాస్పదం అవుతోంది. అనంతపురం టవర్ క్లాక్ వద్ద ఇటీవల ఓ వ్యక్తి పై ట్రాఫిక్ కానిస్టేబుళ్లు దాడి చేశారు. అనంతపురం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓ లాయర్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటనలు మరువకముందే ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఇంతియాజ్ పై దాడి చేయడం పోలీసుల పనితీరును ప్రశ్నిస్తోంది.

ఇదీ చదవండి: తిరుమల: బంగారు బిస్కెట్‌ చోరీ ఘటన కీలక మలుపు

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)