Breaking News

లోకో పైలట్‌ హత్య కేసు: నిందితుడు చిక్కాడు

Published on Sat, 10/12/2024 - 14:18

విజయవాడ, సాక్షి: విజయవాడలో లోకో పైలట్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు బిహార్‌కు చెందిన దేవ్‌ కుమార్‌గా గుర్తించి అరెస్ట్‌ చేశారు. అయితే అనుమానాస్పదంగా ఉన్న దేవ్‌కుమార్‌ను లోకో పైలట్‌ ప్రశ్నించాడు. దీంతో ఇనుపరాడ్‌తో లోకో పైలట్‌పై నిందితుడు దాడి చేశాడని రైల్వే ఏసీసీ రత్న వెల్లడించారు. మచిలీపట్నం వద్ద నిందితుడిని అరెస్ట్‌ చేశామని తెలిపారు. 

విజయవాడ రైల్వే స్టేషన్‌లో  విధుల్లో ఉన్న లోకో పైలట్‌ను ఓ ఆగంతకుడు ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. షంటింగ్‌ లోకో పైలట్‌గా పని చేస్తున్న డి.ఎబినేజర్‌ (52) గురువారం తెల్లవారుజామున విధుల్లో భాగంగా నైజాంగేటు సమీపంలోని ఏటీఎల్‌సీ కార్యాలయం నుంచి ఎఫ్‌–క్యాబిన్‌ వద్దకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అతని వెనుక నుంచి వచ్చి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు.

రాడ్‌తో పలుమార్లు కొట్టడంతో తీవ్ర గాయాలైన ఎబినేజర్‌ అపస్మారక స్ధితిలో రైలు ట్రాక్‌పై పడిపోయాడు. దూరం నుంచి దీనిని గమనించిన మరో లోకో పైలట్‌ వృధ్వీరాజ్‌ పరుగున అక్కడికి వచ్చారు. సమీపంలో ఉన్న వారితో కలిసి ఎబినేజర్‌ను రైల్వే హాస్పటల్‌కు తరలించారు. పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఒక ప్రైవేటు హాస్పటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

విజయవాడ జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేశారు. రైల్వే స్టేషన్‌ పరిసరాలలోని సీసీ టీవీ ఫుటేజ్‌ల ద్వారా దాడికి పాల్పడిన నిందితుడిని గుర్తించారు. ఆ వ్యక్తే నైజాంగేటు సెంటర్‌లో ఆటోలో నిద్రిస్తున్న వ్యక్తిపై కూడా దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతను గంజాయి మత్తులో ఈ దాడులకు పాల్పడుతుండవచ్చని చెబుతున్నారు.

చదవండి: అందరూ చూస్తుండగానే ప్రాణాలు తీశాడు

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)