Breaking News

మెడికల్‌ కాలేజీలకు నిధులుండవు.. ఎర్టీఆర్‌ విగ్రహానికి రూ.1,700 కోట్లా?

Published on Sun, 01/18/2026 - 06:11

జంగారెడ్డిగూడెం: సీఎంచంద్రబాబు పాలనను ఎండగడుతూ ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ జనసేన నాయకుడు బల్లె మురళికి సంబంధి రెండు సెల్ఫీ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు, కాపు కార్పొరేషన్‌కు నిధులుండవు కానీ, ఎన్టీఆర్‌ విగ్రహానికి ఉంటాయా? చంద్రబాబు వైఖరి మార్చుకుంటే చాలా మంచిది. సోషల్‌ మీడియా వచ్చింది. ఎల్లో మీడియాను నమ్మరు. మీరు చెప్పే అబద్ధాలు, నిర్లక్ష్యాన్ని సహించే పరిస్థితి లేదు. మాలాంటి వారితో జనసేనలో మార్పు మొదలైంది’ అంటూ చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘రూ.1,700 కోట్లతో ఎర్టీఆర్‌ విగ్రహం పెడతారంట. ప్రభుత్వ నిర్ణయం ఘోరాతి ఘోరం. దీన్ని జనసైనికులంతా వ్యతిరేకించాలి.

పవన్‌కళ్యాణ్‌కు మద్దతుగా ఎన్నికల్లో కాపు యువత సొంత డబ్బు రూ.లక్ష–రూ.2 లక్షలు ఖర్చు చేశారు. ఇప్పుడు కాపు కార్పొరేషన్‌ ద్వారా లోన్‌ ఇస్తారేమో అని చూస్తున్నారు. కార్యకర్తలు రాకుండా పార్టీ ఆఫీస్‌కు తాళం వేశారు. ఈ ప్రభుత్వంలో జన సైనికులకు ఒరిగింది ఏమీ లేదు. అమరావతి సెల్ఫ్‌ ఫండ్‌ ప్రాజెక్టు, టీడీపీ సెల్ఫ్‌ ఫండ్‌ పార్టీ అన్నారు కదా. ఎర్టీఆర్‌ విగ్రహం కూడా అలాగే కట్టండి. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్‌ (యూకే) అన్నీ మా చేతుల్లో ఉన్నాయని చెప్పుకొనే టీడీపీ వారు ఎర్టీఆర్‌ విగ్రహాన్ని ప్రజల సొమ్ముతో కట్టడం ఏంటి? చంద్రబాబు హైదరాబాద్‌ కట్టేశాడంట.. అమరావతి కట్టలేకపోతున్నాడు. అది మునిగిపోయే ప్లేస్‌. అట్టర్‌ ఫ్లాప్‌. ఒక్క పరిశ్రమ రాదు. వైజాగ్‌ గ్రోత్‌ ఇంజిన్‌ అంటున్నారు. ఆంధ్రాలో రోడ్లన్నీ గోతులమయం.

పవన్‌.. మీరు చంద్రబాబుకు చేసే భజన చూసి సిగ్గుపడుతున్నాం. ఇంత దిగజారతామా?’ అని మురళి ధ్వజమెత్తారు. మొదటి వీడి­యో సంచలనంగా మారడంతో రెండో వీడియో విడుదల చేశారు. ‘ఎర్టీఆర్‌ విగ్రహం ప్రజల సొ­మ్ము­తో కట్టడానికి జనసేన వ్యతిరేకం. దీనిపై సో­ష­ల్‌ మీడియాలో నన్ను తిడు­తున్నారు. నా నంబ­ర్‌ ఉంది. దమ్ముంటే కాల్‌ చేయండి. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఒక్కొ­క్కడి చర్మం తీస్తా. వైఎస్‌ జగ­న్‌కు భయపడి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకుం­డా టీడీపీ వారు పారిపోయారు. అప్పుడు పోటీ చేసింది జనసేన. మేం లేకపోతే మిమ్మల్ని జగన్‌ ఆడుకుంటారు. కానీ, మీరు పదవిలోకి వచ్చాక జనసేనను జీరో చేయాలని చూస్తున్నారు. కాపు కార్పొరేషన్‌ నిధులు ఆపేశారు. ఇది టీడీపీ చేస్తున్న తప్పు’ అని పేర్కొన్నారు.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు