Breaking News

కర్నూలు చేరుకున్న మోదీ

Published on Thu, 10/16/2025 - 09:11

సాక్షి, కర్నూలు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi Kurnool tour) కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కర్నూలు శివారులోని నన్నూరు టోల్‌గేట్‌ సమీపంలో ‘సూపర్‌ జీఎస్టీ - సూపర్‌ సేవింగ్స్‌’ పేరుతో భారీ బహిరంగ సభ జరుగనుంది. సభ వేదిక కోసం 450 ఎకరాల్లో ప్రాంగణం సిద్ధం చేశారు. పర్యటన సందర్బంగా ప్రధాని.. కర్నూలులో రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పర్యటన ఇలా.. 
7.50 AM: ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం
10.20 AM: కర్నూలు ఎయిర్‌పోర్ట్
10.25 AM: సున్నిపెంటకు హెలికాఫ్టర్
11.10 AM: శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్ చేరిక
11.45 AM: భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం
12.45 PM: భ్రమరాంబ గెస్ట్ హౌస్ తిరిగి చేరిక
1.25 PM: సున్నిపెంటకు రోడ్డు మార్గంలో బయల్దేరి
1.40 PM: నన్నూరు హెలిప్యాడ్ చేరిక
2.30 PM: రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
4.00 PM: బహిరంగ సభ
4.15 PM: నన్నూరు హెలిప్యాడ్ చేరిక
4.40 PM: కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కి బయల్దేరి
7.15 PM: ఢిల్లీకి చేరి పర్యటన ముగింపు


కర్నూలులో రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులు..

  • రూ.2,880 కోట్లతో కర్నూలు-3 పూలింగ్‌ స్టేషన్‌ను అనుసంధానించేలా ఏర్పాటుచేసిన ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని.

  • రూ.4,920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లలో పనులకు ప్రధాని శంకుస్థాపన.

  • రెండు కారిడార్లలో సుమారు రూ.21 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తాయన్న కేంద్రం.

  • రెండు కారిడార్ల ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని ప్రకటించిన కేంద్రం.

  • రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి ఈ కారిడార్లు ఆస్కారం కల్పిస్తాయన్న కేంద్రం.

  • రూ.960 కోట్లతో సబ్బవరం-షీలానగర్‌ రహదారికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని.

  • రూ.1,140 కోట్లతో పీలేరు-కాలురు నాలుగు వరుసల రహదారి విస్తరణకు శంకుస్థాపన.

  • గుడివాడ-నూజెండ్ల మధ్య రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ.

Videos

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)