Breaking News

‘యువగళం’ బ్యాచ్‌కు డీఎస్సీలో దొడ్డిదారిన పోస్టులు

Published on Tue, 06/02/2026 - 04:07

సాక్షి, అమరావతి: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో జరిగిన డీఎస్సీ–2025 నియామకాల్లో పెద్ద ఎత్తున అవినీతి, నిర్వహణ లోపాలున్నాయని వైఎస్సార్‌ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారని, కలెక్టరేట్లలో కనీసం మెరిట్‌ లిస్టులు కూడా పెట్టకుండా జీఎస్టీ చట్టం తరహాలో నియామక ప్రక్రియను అత్యంత గందరగోళంగా మార్చేశారని మండిపడ్డారు.

లోకేశ్‌  యువగళం పాదయాత్రలో తన వెంట నడిచిన వారికి సొంత సంస్థ హెరిటేజ్‌లో ఉద్యోగాలిచి్చనంత సులభంగా స్పోర్ట్స్‌ కోటా కింద చివరకు ‘పేకాట’ (బ్రిడ్జ్‌) ఆడేవారికి కూడా దొడ్డిదారిన టీచర్‌ పోస్టులు కట్టబెట్టారని ఆరోపించారు. డీఎస్సీపై లోకేశ్‌  ట్విట్టర్‌లో సొల్లు కబుర్లు ఆపి తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. టెట్, డీఎస్సీ నిర్వహణతో పాటు స్పోర్ట్స్‌ కోటాలో అక్రమాలు తదితర 16 రకాల అంశాలపై ప్రజలకు వివరాలు వెల్లడించాలని కోరుతూ సోమవారం సచివాలయంలో ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసిన అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.  

మెరిట్‌ లిస్టు మాయం 
‘మెగా డీఎస్సీ’ అని ఊదరగొట్టి అభ్యర్థులను దగా చేశారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను మార్కులు, కులం, ర్యాంకులతో సహా ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో ప్రదర్శించడం సంప్రదాయం. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడా మెరిట్‌ లిస్టు డిస్‌ప్లే చేయలేదు. ఆన్‌లైన్‌లో పెట్టామని అబద్ధాలు చెబుతున్నారు. ఆన్‌లైన్‌ జాబితాలో ప్రతిసారీ అభ్యర్థుల పేర్లు మారిపోతుండటంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.  డీఎస్సీ నియామక ప్రక్రియను సంక్లిష్టంగా మార్చేశారు. టీడీపీలో అంతర్గత కలహాలతో హత్యలకు పాల్పడితే చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇస్తారు?’ అని పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు.  

ఆర్టీఐతో కోరిన 16 రకాల కీలక అంశాలివీ... 
2025 డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్‌ ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా కింద ఏ జీవో ప్రకారం, ఏ కేటగిరీలో, ఏ జిల్లాలో ఎంత మందిని నియమించారు? ఎంపికైన అభ్యర్థుల అర్హత పత్రాలు.. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో సాధించిన స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌ వివరాలు ఏమిటి? స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులను ఎంపిక చేయడానికి ప్రభుత్వం నియమించిన సెలక్షన్‌ కమిటీలో ఉన్న పెద్దలు ఎవరు? వారి అర్హతలేమిటి? స్పోర్ట్స్‌ కోటాలో రిజెక్ట్‌ అయిన అభ్యర్థులు ఎవరు? ఎందుకు తిరస్కరించారు? అభ్యంతరాలను పరిశీలించారా? టెట్‌ , డీఎస్సీ పరీక్షా పత్రాలను ఎవరు తయారు చేశారు? ఈ ప్రక్రియలో లేదా మూల్యాంకనంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఎవరైనా పాల్గొన్నారా? దానికి సంబంధించి ప్రభుత్వ అనుమతులు, జీవోల కాపీల వివరాలు వెల్లడించాలి.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)