Breaking News

రాష్ట్ర ప్రజల ఉసురుతో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది

Published on Wed, 06/04/2025 - 13:02

సాక్షి,గన్నవరం: పథకాలు అడిగితే ఖజానా ఖాళీ అంటారు. లోకేష్, పవన్, చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరుగుతారు. లోకేష్ భార్య పిల్లలను చూడడానికి, చంద్రబాబు సొంత ఇల్లు చూడటానికి ప్రజల సొమ్ముతో తిరుగుతారు. అమ్మఒడి అడిగితే ఇవ్వరు. ప్రశ్నిస్తే నోరుమెదపరని కూటమి నేతలపై మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు.

వెన్నుపోటు దినం కార్యక్రమంలో పేర్నినాని మాట్లాడుతూ.. ముగ్గురు కలిసి ప్రజలను మోసం చేశారు. వైఎస్‌ జగన్ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇస్తా అని చెప్పారు. వైఎస్‌ జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు కూడా తానే తీర్చుతానని చెప్పాడు. 12 నెలల కాలంలో లక్ష 51వేల కోట్లు అప్పు చేసారు.ఉచిత బస్సు తుస్సు మంది. సంక్రాంతిలోపు రోడ్లు పూర్తి చేస్తామని చెప్పారు. రోడ్ల మీద తిరిగితే నడుం నొప్పులు వస్తున్నాయి.

పనులు పూర్తి అయినవి బిల్లులు ఇంకా రాలేదు.పథకాలు అడిగితే ఖజానా ఖాళీగా ఉంది.. రూపాయి లేదని చెబుతారు. ప్రజల సొమ్ముతో విలాస జీవితం గడుపుతారు. భార్య పిల్లల్ని చూసేందుకు, దోచుకున్న డబ్బు దాచుకోవడానికి ప్రత్యేక విమానంలో తిరుగుతారు. చికెన్‌లో కమిషన్ అడుగుతారు. ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు లిక్కర్‌ వ్యాపారంలో మునిగి తేలుతున్నారు.

ప్రజలనే కాదు దేవుడిని కూడా మోసం చేస్తున్నారు.రాష్ట్రంలో ఉన్న దేవుడి ఆలయాలను దోచేస్తున్నారు.దేవుడి ఆస్తి ని కూడా నామినేషన్ పద్దతిలో అద్దెకు 99 ఏళ్లకు ఇస్తామని అంటున్నారు. అన్ని మతాలు మావే అని ఇప్పుడు హిందువులు కు మాత్రమే అంటున్నారు. ప్రధాని మోదీని,ఆయన సతీమణినీ తిట్టిన చంద్రబాబుకు పవన్ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు.

లోకేష్ ధగాకోరు అవినీతి పరుడు అన్న పవన్ చంద్రబాబు మరో 15ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నాడు. లక్ష కోట్లు అప్పు చేసి రాష్టాన్ని అప్పుల పాలు చేసిన కూటమి దిగిపోవాలి. గన్నవరంలో తప్పుడు కేసులు లేవని చర్చకు సిద్ధం అన్న నేత చర్చ కు రమంటే పారిపోయాడు. వంశీపై తప్పుడు కేసులు పెడుతున్నారు.

2019లో ఇళ్ల దొంగపట్టాలు చంద్రబాబుకు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా? తప్పు ఉంటే ఎమ్మార్వోని జైల్లో వేయాలన్నారు. వంశీపై తప్పుడు కేసు పెట్టాడు. ఆస్తి తగాదాలో ఇప్పుడు వంశీపై కేసుపెట్టారు. వంశీపై 11 కేసులు పెట్టారు. మైనింగ్ కేసులో అధికారులను ఎందుకు సస్పెండ్ చేయలేదు. వంశీపై పెట్టిన ప్రతి కేసు తప్పుడు కేసు.. దొంగ కేసు. కూటమి తక్షణమే హామీలు అమలు చేయకపోతే పోరాటం చేస్తాం. కూటమి పతనానికి గన్నవరంలో నాంది పడింది. ప్రజల అగ్రహావేశాలలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి