Breaking News

పవన్ కళ్యాణ్‌కి షాకిచ్చిన పీసీసీఎఫ్ చలపతిరావు

Published on Thu, 11/13/2025 - 21:03

విజయవాడ:  76.74 ఎకరాల మంగళంపేట భూములను పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిందని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై పీసీసీఎఫ్(Principal Chief Conservator of Forests) చలపతిరావు స్పందించారు. పవన్‌ ఆరోపణలకు విరుద్ధంగా ఆయన ప్రకటన చేశారు.  అక్కడ 77 ఎకరాలు ఎన్‌క్లోజర్‌ భూమి పెద్దిరెడ్డి కుటుంబీకులకు ఉందని ఆయన వెల్లడించారు. 76.74 ఎకరాల భూమి తమదే అని ఎంపీ మిథున్ రెడ్డి వాదనతో చలపతిరావు ఏకీభవించారు. 

కాగా, 76.74 ఎకరాలు పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిందని పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. దీనిపై ఎంపీ మిథున్‌రెడ్డి రికార్డులను సైతం వెల్లడించారు. ఎంపీ మిథున్‌రెడ్డి వాదనతో చలపతిరావు ఏకీభవించడంతో పవన్‌ కళ్యాణ్‌ చేసినవి ఆరోపణలేని తేటతెల్లమైంది. 

పెద్దిరెడ్డి భూముల ఫెన్సింగ్ బయట ఉండటంతో వాటిని ఆయన కుటుంబానికి ఆపాదించి తప్పుడు ప్రచారం చేశారు. అయితే  అటవీ భూమి పక్కన పెద్దిరెడ్డి భూములు ఉన్నాయని పీసీసీఎఫ్ స్పష్టం చేశారు. అందుకే పెద్దిరెడ్డి కుటుంబంపై కేసు పెట్టామన్నారాయన.

ఇప్పటికే ఈ భూములపై సర్వే చేయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించలేదని చంద్రబాబు ప్రభుత్వం సైతం నిర్దారించింది. గతంలో  కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో కూడా ఈ భూములపై విచారణ జరిపారు. అప్పుడు కూడా ఆక్రమించలేదని విచారణలో నిర్ధారణయ్యింది. 

అయితే పెద్దిరెడ్డి కుటుంబంపై కక్షకట్టి నోటీసులు జారీ చేశారు. నోటీసులపై పెద్దిరెడ్డి కుటుంబం కోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం కోర్టు విచారణలో ఉన్న భూములపై పవన్‌ కళ్యాణ్‌ ఆరోపణలు చేశారు.  దానికి ఎంపీ మిథున్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. నిజంగానే కబ్జా చేస్తే ఇన్నాళ్లూ చర్యలు తీసుకుంటారా? అని మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. దీనికి పవన్‌ నుంచి సమాధానం రాలేదు. మరొకవైపు అక్కడ 77 ఎకరాలు ఎన్ క్లోజర్ భూమి పెద్దిరెడ్డి కుటుంబీకులకు ఉందని పీసీసీఎఫ్‌ వెల్లడించడంతో  పవన్‌ హెలికాఫ్టర్ ఎపిసోడ్‌ బెడిసికొట్టినట్లయ్యింది.

పవన్‌పై వైఎస్సార్‌సీపీ సీరియస్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)