Breaking News

మహా కంత్రీ కిరణ్‌ రాయల్‌! ఏకంగా పవన్‌నే..

Published on Sat, 02/15/2025 - 16:20

తిరుపతి, సాక్షి: జనసేన నేత కిరణ్‌ రాయల్‌పై సంచలన ఆరోపణలు వస్తున్నా.. ఆ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఓ మహిళ అతని చేతిలో మోసపోయానని, తనకు న్యాయం చేయమని, తనలాంటి వాళ్లెందరినో మోసం చేశాడని మీడియా ముందుకు వచ్చినా ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) గప్‌చుప్‌గా ఉండిపోయారు. అయితే కిరణ్‌ రాయల్‌ బాధితురాలు లక్ష్మి.. ఇవాళ చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది .

పవన్‌ కల్యాణ్‌ అండ చూసుకునే కిరణ్‌ రాయల్‌ రెచ్చిపోతున్నాడని లక్ష్మి(Laxmi) మరోసారి మీడియా ముందు ఇవాళ ఉద్ఘాటించారు. ఈ క్రమంలో సంచల వ్యాఖ్యలు చేశారు. ‘‘పవన్ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్ నా వెంట ఉన్నారని నిత్యం కిరణ్ రాయల్ చెప్పేవాడు. నా దగ్గర పవన్ రహస్య జీవితాన్ని సంబంధించిన పెన్ డ్రైవ్ ఉందని, అందుకే ఆయన తనను ఏమీ చేయడని.. ఏమీ అనడని కిరణ్ నాతో చాలా సార్లు చెప్పాడు. 

.. ఈ కారణం వల్లనే తాను ఏమి చేసినా.. చంద్రబాబు సహా ఎవరినీ తిట్టినా పవన్ కల్యాణ్‌ అసలు పట్టించుకోరని కిరణ్ రాయల్‌(kiran Royal) అనేవాడు. ఒకానొక టైంలో..  ‘పవనే చాలా సార్లు బ్లాక్ మెయిల్ చేశా.. ఇక నువ్వు ఎంత అని కిరణ్‌ నాతో అన్నాడు’ అని లక్ష్మి  మీడియా ముందు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆడవాళ్లను మోసం చేసి.. వాళ్ల సొమ్ముతో రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతున్న వ్యక్తికి అండగా నిలబడడం సమంజసమేనా? అని పవన్‌ కల్యాణ్‌ను ఆమె ప్రశ్నించారు కూడా. మరి ఇంతటి సంచలన ఆరోపణల నేపథ్యంలో అయినా.. జనసేన కిరణ్‌పై చర్యలు తీసుకుంటుందా? లేదా? అనేది చూడాలి. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)