Breaking News

మోడల్‌ స్కూల్‌లో కులవివక్ష!

Published on Wed, 01/07/2026 - 05:59

చంద్రగిరి: సీఎం చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పనపాకంపేట మోడల్‌ స్కూల్‌లో కుల వివక్ష చోటుచేసుకుంది. తమ పిల్లలను దళిత విద్యార్థులతో కలిసి చదివించేందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. టీడీపీ నాయకుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి మోడల్‌ స్కూల్‌ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించి అనధికారికంగా పాత పాఠశాలలోనే తమ పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు. అయితే, మోడల్‌ స్కూల్‌లో సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో తమ పిల్లలకు అన్యాయం జరుగుతోందని అక్కడ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం ఆందోళనకు దిగారు.

ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రగిరి మండలంలోని పనపాకం పంచాయతీలో ఉన్న అరిగెలవారిపల్లి, ఇరివిశెట్టివారిపల్లి, తూర్పుపల్లి ప్రాథమిక పాఠశాలలను పనపాకంపేట ప్రాథమిక పాఠశాలలో విలీనం చేసి మోడల్‌ స్కూల్‌గా ఏర్పాటుచేశారని చెప్పారు. ఇక్కడ సుమారు 65 మంది విద్యార్థులకు నలుగురు ఉపాధ్యాయులను విద్యాశాఖ అధికారులు నియమించారని తెలిపారు. నెలరోజులపాటు పాఠశాల సవ్యంగా సాగిందన్నారు.

ఆ తర్వాత పనపాకంపేట మోడల్‌ స్కూల్‌లో ఆ గ్రామ దళిత విద్యార్థులు ఉన్నారని, వారితో కలిసి చదువుకునేందుకు తమ పిల్లలను పంపించబోమని అరిగెలవారిపల్లికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారని పేర్కొన్నారు. వారి పిల్లలను మోడల్‌ స్కూల్‌కు పంపకుండా నిలిపేశారని వివరించారు. ఆపై టీడీపీ నాయకులు జోక్యం చేసు­కుని అనధికారికంగా అరిగెలవారిపల్లిలోని పా­త పాఠశాలలోనే వారి పిల్లలను తిరిగి చేరి్పంచారని తెలిపారు. అనధికారికంగా నిర్వ­హిస్తున్న అరిగెలవారిపల్లిలోని పాత పాఠశాలకు విద్యాశాఖ అ«ధికారులు సైతం మోడల్‌ స్కూల్‌ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించారని పేర్కొన్నారు. 

త్వరలో సమస్య పరిష్కరిస్తాం: ఎంఈవో 
ఈ విషయంపై ఎంఈవో లలిత కుమారిని ‘సాక్షి’ వివరణ కోరగా... అరిగెలవారిపల్లి నుంచి విద్యార్థులు రావడానికి ఇబ్బందులు ఉన్నట్లు తెలిపారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ ఊరిలోనే పాఠశాల కొనసాగిస్తున్నట్లు చెప్పా­రు. తల్లిదండ్రుల ఆందోళనల గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని ఆమె వివరించారు.

మా పిల్లల చదువులు అటకెక్కాయి
పనపాకంపేట మోడల్‌ స్కూల్‌లో 45 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మిగిలారని తల్లిదండ్రులు తెలిపారు. వారిలో ఒక ఉపాధ్యాయుడు పది రోజుల కిందట డిప్యూటేషన్‌పై మరో పాఠశాలకు వెళ్లడంతో తమ పిల్లల చదువులు అటకెక్కాయని ఆవేదన వ్యక్తంచేశారు. నాలుగు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు ఉండటంతో పిల్లలు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. టీడీపీ నాయకులు చెప్పినట్లు విద్యాశాఖ అ«ధికారులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

అనధికారికంగా నిర్వహిస్తున్న అరిగెలవారిపల్లి పాఠశాలలో 20 మంది పిల్లలు ఉన్నారని, అక్కడ ఇద్దరు ఉపాధ్యాయులను నియమించి, ఇక్కడ మాత్రం 45 మంది విద్యార్థులకు ఒకే ఒక్కరిని నియమించడం ఏమిటని ప్రశ్నించారు. దళిత విద్యార్థులంటే అధికారులకు చిన్నచూపా... అంటూ మండిపడ్డారు. మూడు గ్రామాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తును విస్మరించి, అరిగెలవారిపల్లి టీడీపీ నాయకులు చెప్పినట్లు అధికారులు నడుచుకుంటున్నారంటూ మండిపడ్డారు. కేవలం దళితులు ఉన్న పాఠశాల కావడంవల్లే అధికార పార్టీ నేతలు వివక్షతోనే మోడల్‌ పాఠశాలలో ఉపాధ్యాయులు లేకుండా చేసి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)