Breaking News

రాజధానిలో రెండో విడత భూసమీకరణ

Published on Wed, 12/03/2025 - 04:26

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం కోసం రెండో విడతలో 20,494.87 ఎకరాల భూసమీకరణకు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) కమిషనర్‌కు ప్రభుత్వం అనుమతిచ్చింది. పల్నాడు జిల్లా అమరావతి మండలంలో నాలుగు గ్రామాలు, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో మూడు గ్రామాల్లో 16,562.56 ఎకరాలు పట్టా, 104.01 ఎకరాల అసైన్డ్‌ భూమి కలిపి మొత్తం 16,666.57 ఎకరాలను రైతుల నుంచి సమీకరించనుంది. మంత్రుల బృందం(జీవోఎం) 21వ సమావేశం మినిట్స్‌ ప్రకా­రం ఆ భూములను ఏపీ సీఆర్‌డీఏ చట్టం సెక్షన్‌–55(2) ప్రకారం రైతుల నుంచి సమీకరించేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతి ఇస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్ కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మేరకు పట్టా, అసైన్డ్‌ భూమి 16,666.57 ఎకరాలతోపాటు 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా సీఆర్‌డీఏ కమిషనర్‌ సమీకరించనున్నారు. అంటే.. రెండో విడత భూసమీకరణలో మొత్తం 20,494.87 ఎకరాల భూమిని సీఆర్‌డీఏ సమీకరించనుంది.  రాజధానిలో రెండో విడత భూసమీకరణకు జూన్‌ 24న రాష్ట్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. తొలుత గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 11 గ్రామాల్లో 44,676.44 ఎకరాలను సమీకరించేందుకు సిద్ధమైంది. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్పట్లో వెనక్కి తగ్గింది.

తొలుత ఏడు గ్రామాల పరిధిలో 20,494.87 ఎక­రాల సమీకరణకు గత నెల 28న మంత్రివర్గం ఆమో­దం తెలిపింది. రెండో విడత భూసమీకరణ కింద భూములు ఇచ్చే రైతులకు జూలై 1న జారీ చేసిన ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం–2025 మార్గదర్శకాల ప్రకారం ప్రయోజనం చేకూర్చుతామని ప్రభుత్వం పేర్కొంది. 

భూసమీకరణ ఇలా...
ప్రస్తుతం పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురంలో పట్టాభూమి 1,965 ఎకరాలు, ప్రభుత్వ భూమి 1,395.48 ఎకరాలు, పెదమద్దూరులో పట్టా భూమి 1,018 ఎకరాలు, ప్రభుత్వ భూమి 127 ఎకరాలు, యండ్రాయిలో పట్టా భూమి 1,879 ఎకరాలు, అసైన్డ్‌ భూమి 46 ఎకరాలు, ప్రభుత్వ భూమి 241 ఎకరాలు, కర్లపూడి లేమల్లెలో పట్టా భూమి 2,603 ఎకరాలు, అసైన్డ్‌ భూమి 51 ఎకరాలు, ప్రభుత్వ భూమి 290.75 ఎకరాలను సమీకరిస్తారు.

అదేవిధంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వడ్డమానులో పట్టా భూమి 1,763.29 ఎకరాలు, అసైన్డ్‌ భూమి 4.72, ప్రభుత్వ భూమి 168.86, హరిశ్చంద్రాపురంలో పట్టా భూమి 1,448.09 ఎకరాలు, అసైన్డ్‌ భూమి 2.29 ఎకరాలు, ప్రభుత్వ భూమి 977.87 ఎకరాలు, పెదపరిమిలో పట్టా భూమి 5,886.18 ఎకరాలు, ప్రభుత్వ భూములు 627.34 ఎకరాలను సమీకరిస్తారు.  

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)