Breaking News

2 నెలల తర్వాత ఎముకలు, బూడిద ఎలా వచ్చాయి?

Published on Sun, 07/05/2026 - 05:09

సాక్షి, అమరావతి: అబ్రకదబ్ర అంటూ గా­ల్లో వస్తువులు సృష్టించడం ఇంద్ర­జాల విద్య. కానీ చంద్రబాబు ప్రభు­త్వ­ం అంతకంటే నాలు­గాకులు ఎక్కువే చదివింది. అబ్రకదబ్ర అంటూ ఏకంగా పోలీస్‌ స్టేషన్‌ డాబా మీదే ఎముకలు, బూడిద సృష్టించింది. సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌లో అంతమైన కేసును నీరుగార్చేందుకు సరికొత్త కట్టు­కథను తెరపైకి తెచ్చింది. ఈ కేసు నుంచి పోలీసు, ప్రభుత్వ పెద్దలను తప్పించేందుకు ఏకంగా న్యాయస్థానం కళ్లుగప్పేందుకు బరితెగించింది. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే డీజీపీ కార్యాలయంలో పక్కా స్కెచ్‌ సిద్ధమైపోయిందని హై­కోర్టు­లో పోలీసులు సమర్పించిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ బట్టబయలు చేస్తోంది.

కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌పై తమకు కొన్ని ఎముకలు, కొంత బూడిద దొరికినట్లు హఠా­త్తుగా ఓ కట్టుకథను వినిపించడం విస్మయ పరు­స్తోంది. సాయికృష్ణ అదృశ్యంపై దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వ్యవహారంలో హై­కోర్టును బురిడీ కొట్టించడం.. ఈ కేసు నుంచి టాస్క్ ఫోర్స్  అధికారులు, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌తోపాటు తెరవెనుక పోలీసు, ప్రభుత్వ పెద్దల పాత్రను తప్పించడం.. కేసు సీబీఐ పరిధిలోకి వెళ్లకుండా అడ్డుకోవడ­మే లక్ష్యంగా పోలీసులు పన్నిన కుతంత్రం విస్తుగొలుపుతోంది. 

రెండు నెలల తర్వాత పోలీస్‌ స్టేషన్‌పై ఎముకలు, బూడిద! 
సాయికృష్ణ లాకప్‌లో అదృశ్యమైన దారుణాన్ని దారి మళ్లించేందుకు పోలీసులు పన్నిన సరికొత్త పన్నాగం విస్మయ పరుస్తోంది. సాయికృష్ణను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆయన తల్లి విజయలక్ష్మి న్యాయస్థానాన్ని నెల క్రితమే ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తునకు నియమించిన సిట్‌ అధికారిక సమాచారం ప్రకారం సాయికృష్ణను మే 6న కృష్ణలంక పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఆ తర్వాత నుంచి ఆయన కనిపించలేదు. అంటే ఇప్పటికి దాదాపు రెండు నెలలు అవుతోంది. రెండు నెలల తర్వాత సిట్‌ అధికారులు కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ డాబా మీద హఠాత్తుగా కొన్ని ఎముకలు, కొంత బూడిదను గుర్తించారట. 

అంతే కాకుండా అనుమానాస్పద మరకలతోపాటు ఓ లాఠీని కూడా గుర్తించారని సిట్‌ హైకోర్టుకు సమరి్పంచిన నివేదికలో పేర్కొంది. సాయికృష్ణను ఎక్కడికో తరలించి మరీ దహనం చేయడం ద్వారానో మరో విధ­ంగానో లేకుండా చేశారని ఇదే సిట్‌ మొదట పేర్కొంది. విద్యుత్‌ దహన వాటికలో అనాథ మృతదేహంగా బూడిద చేశారనే బలమైన వాదనా ఉంది. సిట్‌ అధికారులు విద్యుత్‌ దహన వాటికకు వెళ్లి దర్యాప్తు చేశారు కూడా. కాగా అందుకు విరుద్ధంగా పోలీస్‌స్టేషన్‌ డాబా మీదే ఎముకలు, బూడిద దొరికాయని సిట్‌ చెప్పడం విడ్డూరం. 

హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ నుంచి తప్పించుకునేందుకే.. 
సాయికృష్ణ ఆచూకీ కోసం ఆయన తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టుకు ఏం చెప్పాలనే దానిపై పోలీసు పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. సాయికృష్ణను గానీ, ఆయన మృతదేహాన్ని గానీ, ఆయనకు సంబంధించిన డీఎన్‌ఏ అవశేషాలనుగానీ గుర్తించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. అందుకే తాము ఏదో ఎముకలు, బూడిద కనుగొన్నాం.. దర్యాప్తు కొనసాగుతోందని హైకోర్టును తప్పుదారి పట్టించాలన్నది పోలీసుల ఎత్తుగడ అని స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఆ ఎముకలు, బూడిద సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి డీఎన్‌ఏ నమూనాలతో కనీసం పరీక్ష కూడా చేయించలేదు. కొన్ని వాయిదాల తర్వాత డీఎన్‌ఏ నమూనాలు సరిపోలేదని చెప్పవచ్చులే అన్నది పోలీసుల ధీమాగా స్పష్టమవుతోంది.

సిట్‌.. ఈ ప్రశ్నలకు బదులివ్వాలి 
» ఎక్కడో బయటకు తీసుకువెళ్లి దహనం చేసి ఉంటే.. అక్కడి నుంచి ఎముకలు, బూడిద తీసుకువచ్చి పోలీస్‌ స్టేషన్‌ మీద దాచారా? 
»  ఒకవేళ పోలీస్‌ స్టేషన్‌ డాబా మీదే సాయికృష్ణ మృతదేహాన్ని దహనం చేసి ఉంటే, అప్పుడు వచ్చే మంటలు, పొగను ఆ చుట్టుపక్కల ఉన్న వందలాది నివాసాల్లో ఉన్న వారు గమనించలేదా? 
» అదే జరిగి ఉంటే అప్పుడు పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న అధికారులు, సిబ్బంది అందరికీ ఈ విషయం తెలిసి ఉండదా? 
» మరి విజయవాడ కోర్టుకు సమర్పించిన సాయికృష్ణ రిమాండ్‌ రిపోర్టులో ఆ విషయాలను ఎందుకు వెల్లడించ లేదు? 
»ప్రస్తుతం హఠాత్తుగా హైకోర్టుకు ఎందుకు ఈ విషయాన్ని చెప్పినట్టు?  
» హైకోర్టును తప్పుదారి పట్టించేందుకు ఇది బరితెగించడం కాదా?

టాస్క్ ఫోర్స్, సీపీ, డీజీపీ, పెద్దలను తప్పించడమే లక్ష్యం
టీడీపీ ప్రజా ప్రతినిధి భూ, ఆర్థిక లావాదేవీల వివాదం నేపథ్యంలోనే సాయికృష్ణను అంతం చేశారన్నది బహిరంగ రహస్యం. ఈ వ్యవహారం వెనుక కేవలం సీఐ నాగరాజు పాత్రధారి మాత్రమేనని.. టాస్క్ ఫోర్స్  అధికారులు, పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు పాత్ర ఉందన్నది నిర్వివాదాంశం. డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా, ప్రభుత్వ పెద్దలు సూత్రధారులుగా ఉన్నారని పోలీసువర్గాలే చెబుతున్నాయి. ఈ కేసును కేవలం సీఐ నాగరాజు వరకే పరిమితం చేయాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం. అందుకే కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ డాబా మీదే ఎముకలు, బూడిద దొరికినట్టు కట్టు కథను తెరపైకి తెచ్చారు. 

కాగా, సాయికృష్ణ లాకప్‌లోనే అదృశ్యం కావడం జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. ఈ కేసును ఏపీ పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయలేరన్నది స్పష్టమవుతోంది. అందుకే ఈ కేసును సీఐబీకి అప్పగించాలని సామాజికవేత్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. సీబీఐ రంగంలోకి దిగితే టాస్క్ ఫోర్స్  అధికారులు, సీపీ, డీజీపీలతోపాటు ప్రభుత్వ పెద్దల పాత్ర బట్టబయలవుతుంది. అందుకే ఈ కేసు దర్యాప్తులో ఏదో పురోగతి సాధించామని నమ్మించేందుకు.. సీబీఐ దర్యాప్తు అవసరం లేదని వాదించేందుకు వీలుగా పోలీసు పెద్దలే పోలీస్‌ స్టేషన్‌పై కొన్ని ఎముకలు, కొంత బూడిద లభించాయనే కట్టుకథను సృష్టించారన్నది స్పష్టమవుతోంది. సాయికృష్ణ లాకప్‌ హత్య కేసును పూర్తిగా నీరుగార్చేందుకు పోలీసు పెద్దలు ఇంతగా బరితెగిస్తుండటం సదరు శాఖలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)