Breaking News

వాలంటీర్లను తీసుకుంటే లీగల్‌ సమస్యలు: నారా లోకేష్‌

Published on Sun, 01/05/2025 - 13:41

సాక్షి, అమరావతి: కూటమి నేతలు మాటల మార్చారు. వాలంటీర్ల విషయంలో కూటమి నేతలు యూటర్న్‌ తీసుకున్నారు. ఎన్నికలకు ముందు ఒకలా.. ప్రభుత్వంలో మరోలా మాట్లాడుతూ.. వాలంటీర్ల(volunteers)ను తీసుకుంటే లీగల్‌ సమస్యలు వస్తాయని బూకాయిస్తున్నారు. దీంతో, వాలంటీర్లకు నిరాశే ఎదురుకానుంది.

వాలంటరీ వ్యవస్థకు కూటమి ప్రభుత్వం మొండిచేయి ఇచ్చింది. వారిని విధుల్లోకి తీసుకోమని మంత్రి నారా లోకేష్‌(Nara Lokesh) పరోక్షంగా స్పష్టం చేశారు. పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతారని తమ మంత్రి చెప్పారని ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో వాలంటీర్లను తీసుకుంటే లీగల్‌ సమస్యలు వస్తాయని చెప్పుకొచ్చారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) మాత్రం ఎన్నికలకు ముందు వాలంటరీ వ్యవస్థ కొనసాగుతుందన్నారు. అలాగే, వాలంటీర్లకు రూ.10వేలు జీతం ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు మాట మార్చడం గమనార్హం.

ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప​ంగా వాలంటీర్లు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. తమను విధుల్లోకి తీసుకోవాలని నిరసనల్లో పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు కూటమి నేతలు హామీ ఇచ్చిన విధంగా తమకు రూ.10వేల జీతం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. నిరసనల్లో భాగంగా విజయవాడలో వాలంటీర్లు వినూత్నంగా వెనక్కి నడుస్తూ ఆందోళనలు చేపట్టారు. ఇది యూటర్న్‌ ప్రభుత్వం అనే ప్రయత్నం భాగంగా తాము ఇలా వెనక్కి నడిచినట్టు తెలిపారు. 

 

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)