Breaking News

చింపేస్తాం.. పీకేస్తాం.. నారా లోకేష్‌ ఓవర్‌ యాక్షన్‌

Published on Mon, 06/05/2023 - 07:24

సాక్షి, వైఎస్సార్‌(చాపాడు): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర ఆదివారం వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఈవెనింగ్‌ వాక్‌లా సాగింది. మూడు రోజులపాటు సాయంత్రం 5 గంటల తర్వాతే లోకేశ్‌ పాదయాత్ర జరిగింది. ఇదేం పాదయాత్ర అని స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఇలా అయితే ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని వారు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. పాదయాత్ర పొడవునా ప్రతి గ్రామం వద్ద అక్కడికి వచ్చే కొద్దిపాటి మందిని లోకేశ్‌ దగ్గరకు రప్పించుకుని సెల్ఫీలు తీయించుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.  

సీఎం ఫ్లెక్సీపై లోకేశ్‌ వాగ్వాదం.. రాత్రికి చించివేత 
ఇదిలా ఉంటే.. మండల కేంద్రమైన చాపాడులో శనివారం రాత్రి జరిగిన పాదయాత్రలో చాపాడు వద్ద వెలసిన పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం పేరుతో ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌ ఫ్లెక్సీపై పోలీసులతో లోకేశ్‌ వాగ్వాదం చేశారు. తమ తండ్రిని కించపరిచేలా ఉన్న ఫ్లెక్సీని చింపేస్తాం.. పీకేస్తాం.. అంటూ మైదుకూరు అర్బన్‌ సీఐ చలపతి, రూరల్‌ సీఐ నరేంద్రరెడ్డిలతో ఆయన వాగ్వాదం చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు.

రాత్రి 11 గంటల ప్రాంతంలో చాపాడు కూడలిలో ఉన్న ఇద్దరు పోలీసులను కారులో వచ్చిన కొందరు వ్యక్తులు బెదిరించి అక్కడి సీఎం జగన్‌ ఫ్లెక్సీని చించేశారు. దీనిపై స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేయగా ఆదివారం పోలీసులు ఖాజీపేట ప్రాంతంలో ఆ కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. ఖాజీపేట మండలంలోనూ వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీనీ టీడీపీ కార్యకర్త చించివేయడం వివాదాస్పదమైంది. పోలీసులు జో­క్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.

చదవండి: RBI Report: అలర్ట్‌.. నకిలీ నోట్లపై ఆర్‌బీఐ కీలక రిపోర్ట్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)