Breaking News

ఏసీబీ జడ్జిపై పోస్టు పెట్టిన ‍వ్యక్తి అరెస్ట్‌

Published on Thu, 09/28/2023 - 08:47

సాక్షి, నంద్యాల: స్కిల్‌ స్కామ్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత.. సోషల్‌ మీడియాలో యెల్లో బ్యాచ్‌ అడ్డగోలుగా రెచ్చిపోయింది. ఆయనకు సంబంధించి పలు పిటిషన్లపై దర్యాప్తు చేపట్టిన న్యాయమూర్తులపైనా అనుచిత పోస్టులు చేస్తూ పైశాచిక ఆనందం పొందారు. అయితే దర్యాప్తు క్రమంలో ఇందులో బాబు మద్దతుదారుల కంటే టీడీపీ నేతల పాత్రే ఎక్కువుందని తేటతెల్లమవుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో ఓ టీడీపీ నేత అరెస్ట్‌ అయ్యారు. 

స్కిల్‌ స్కాం కేసులో చంద్రబాబు నాయుడికి రిమాండ్‌ విధించిన ఏసీబీ కోర్టు జడ్జిని అవమానిస్తూ పోస్టులు పెట్టాడు ఓ వ్యక్తి. అయితే అతన్ని ట్రేస్‌ చేసిన పోలీసులు.. ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. సదరు వ్యక్తి టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ముల్లా ఖాజా హుస్సేన్‌గా ధృవీకరించారు.

పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి.. ఓ ప్రైవేట్‌కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు ఖాజా హుస్సేన్‌. ఈ క్రమంలో.. విజయవాడ ఏసీబీ న్యాయమూర్తి హిమబిందును టార్గెట్‌ చేసి సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు చేశాడు. టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి హోదాలోనే పోస్టులు చేసినట్లు అంగీకరించాడతను. అరెస్ట్‌ చేసిన నంద్యాల పోలీసులు.. ఇవాళ కోర్టులో హాజరుపరిచే ఛాన్స్‌ ఉంది.  

మరోవైపు జడ్జిలపై అనుచిత పోస్టులు, ట్రోలింగ్‌ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం క్రిమినల్‌ కంటెంప్ట్‌ పిటిషన్‌ వేసింది ఏపీ హైకోర్టులో. ప్రభుత్వం తరపున ఏపీ శ్రీరామ్‌ ‘‘ఉద్దేశపూర్వక క్యాంపెయిన్‌ జరిగిందని.. జడ్జిలను, వాళ్ల కుటుంబ సభ్యులనూ వదలకుండా ట్రోలింగ్‌ చేశారని, ఈ క్రమంలోనే అనుచిత పోస్టులు పెట్టార’ని వాదించారు. అనంతరం సోషల్‌ మీడియాలో పోస్టులు చేసిన సదరు 26 మంది అకౌంట్లను పరిశీలించి.. నోటీసులు జారీ చేయాలని ఏపీ డీజీపీకి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.  బుద్దా వెంకన్నతో పాటు సోషల్‌ మీడియా పేజీల ముసుగులో ఉన్న టీడీపీ నేతలకు నోటీసులు జారీ కానున్నాయి. అంతకు ముందు రాష్ట్రపతి భవన్‌ సైతం జడ్జిలపై అనుచిత కామెంట్ల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి.. కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)