Breaking News

మొదటి అరెస్ట్‌ నారా లోకేష్‌దే: లక్ష్మీపార్వతి

Published on Sun, 01/18/2026 - 11:43

సాక్షి, హైదరాబాద్‌: ఏపీలో అరాచక పాలన సాగుతోందన్నారు వైఎస్సార్‌సీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. లక్షల కోట్లు దండుకుని ఇతర దేశాల్లో దాస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్‌ మీదకు చెప్పులు వేయించిన వ్యక్తి.. ఇప్పుడు మళ్లీ విగ్రహం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు.

నందమూరి లక్ష్మీపార్వతి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు వెన్ను పోటుకు 30 ఏళ్ళు గడిచాయి. ఆరోజు మహా నాయకుడు ఎన్టీఆర్‌ మీద చెప్పులు వేశాడు. మళ్ళీ ఇప్పుడు విగ్రహం పెడతాను అని రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు ప్రతిష్ట పడిపోతున్నపుడు ఎన్టీఆర్ పేరు వాడుకుంటాడు.  దుర్మార్గంగా ఎన్టీఆర్‌కు జరిగిన ద్రోహం అందరూ ఆలోచించాలి. బాబు చెప్పే అబద్దాలు నమ్మొద్దు. ఇప్పటికైనా ఎన్టీఆర్ చివరి క్షణంలో పడిన క్షోభను గమనించాలి. ఎన్టీఆర్ చివరి క్షణంలో ఇచ్చిన ఇంటర్వ్యూ అందరూ చూడండి. చంద్రబాబు లాంటి దుర్మార్గుడికా నేను పిల్లను ఇచ్చింది అని ఎన్టీఆర్ బాధ పడ్డారు. చంద్రబాబును రాజకీయాల్లో ఉంచకూడదు అని ఎన్టీఆర్ అన్నారు.

చంద్రబాబు అబద్దాల చరిత్రను నమ్మొద్దు. మీరు ఎన్టీఆర్ చెప్పింది మరోసారి వినండి. నిజమైన ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు మోసాన్ని నమ్మరు. నిజమైన ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబును సహించరు. మొన్న కూడా ఈవీఎంల ద్వారా మోసం చేసి వచ్చాడు. అబద్దపు హామీలు చేసి అధికారంలోకి వచ్చాడు. అందరినీ మోసం చేసి అధికారం చేజిక్కించుకున్నారు. తండ్రి కొడుకులకు దోపిడీ తప్ప హామీలు నెరవేర్చే ఆసక్తి లేదు. లక్షల కోట్లు దండుకుని ఇతర దేశాల్లో దాస్తున్నారు. మళ్ళీ ఆయన మీద కేసులు కొట్టి వేయించుకుంటున్నారు.

జగనే నంబర్‌ వన్‌.. 
ఎన్టీఆర్, వైఎస్సార్ ప్రజల్లో ఎప్పటికీ నిలిచారు. భారత్‌లోనే పవర్‌ ఫుల్‌ స్థానంలో వైఎస్‌ జగన్‌​ ఉన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో దేశంలోనే నంబర్ వన్ వైఎస్‌ జగన్. మళ్లీ జగన్‌ను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఏపీలో ఎవరికీ పండగ సంతోషంగా జరగలేదు. పండగ పేరుతో రాష్ట్రాన్ని జూదం, పందేలు, రికార్డింగ్ డాన్సులు అనే విధంగా చేశారు. వైఎస్‌ జగన్‌ విశాఖను అందంగా తీర్చిదిద్దారు.  కానీ, చంద్రబాబు, లోకేష్‌ మాత్రం.. విశాఖను అశ్లీల నృత్యాలకు వేదిక చేశారు.

లోకేష్‌దే మొదటి అరెస్ట్‌..
లోకేష్ రెడ్ బుక్ పాలనా ఆయన మెడకే చుట్టుకుంటుంది. నేను ప్రధాని మోదీకి కూడా లేఖ రాస్తాను. ఇలాంటి వారిని మీరు ఎంకరేజ్ చేయొద్దు. హంతకులను మీరు వెనుకేసుకురావొద్దు. ఇంత అవినీతిలో కూరుకుపోయిన వారిన మీకు స్నేహితులా?. జగన్ అధికారంలోకి వచ్చాక మొదట అరెస్ట్ అయ్యేది లోకేష్. ఆయన అవినీతిలో కూరుకుపోయారు. ఎన్టీఆర్ బతికి ఉన్నఫుడు చంపేశారు. ఇపుడు విగ్రహం పెడుతామని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబుకు చాతనైతే ఎన్టీఆర్‌కి భారతరత్న ఇప్పించాలి అని డిమాండ్‌ చేశారు. 

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)