కరువు, చంద్రబాబు కవల పిల్లలు : ఎంపీ విజయసాయిరెడ్డి

Published on Wed, 10/30/2024 - 11:24

సాక్షి,అమరావతి: చంద్రబాబు, కరువు అవిభక్త కవలలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. వారి మధ్య విడదీయలేని బంధం ఉందని అన్నారు

ఏపీలో వర్షాలు లేక, పంటలు పండక ఐదు జిల్లాల్లో కరువు తాండవించినట్లు ప్రభు­త్వమే తేల్చింది. ఈ మేరకు రాష్ట్రంలోని 54 మండలా­లను కరువు మండలాలుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నంబరు15 జారీ­చేసింది. ఈ జీవోపై ఎంపీ విజయసాయిరెడ్డి  ఎక్స్‌ వేదికగా  స్పందించారు.

 

బాబు వస్తే కరువు వస్తుంది.చంద్రబాబు, కరువు కవల పిల్లలు అనేది నానుడి. ఈ ఏడాది నైరుతి అనుకూలించినా రాయలసీమలో కరువు నీడలు వెంటాడుతున్నాయి. ఐదు జిల్లాలలో 54 మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి.

వైఎస్సార్‌సీపీ హయాంలో రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్లపాటు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తే టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని పక్కన పెట్టి రైతుల ఉసురు తీసుకుంటున్నారు’ అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు. 

రాష్ట్రంలో తాండవించిన కరువు..  
కాగా, రాష్ట్రంలో దుర్భిక్షం మొద­లైంది. వర్షాలు లేక, పంటలు పండక ఐదు జిల్లాల్లో కరువు తాండవించినట్లు ప్రభు­త్వమే తేల్చింది.
వర్షాలు లేక, పంటలు పండక ఐదు జిల్లాల్లో కరువు తాండవించినట్లు ప్రభు­త్వమే తేల్చింది. రాష్ట్రంలోని 54 మండలా­లను కరువు మండలాలుగా ప్రకటిస్తూ మంగళవారం ప్రభుత్వం జీవో నంబరు 15 జారీ­చేసింది. కర్నూలు, అనంతపురం, శ్రీసత్య­సాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఉన్న ఈ మండలాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదవడంతో దుర్భిక్ష పరిస్థి­తులు నెలకొన్నట్లు తెలిపింది. 27 మండ­లాల్లో తీవ్రమైన దుర్భిక్ష పరి­స్థితులు, 27 మండలాల్లో దుర్భిక్ష పరిస్థి­తులు నెలకొన్నా­యని పేర్కొంది. కలెక్టర్లు ఆయా జిల్లా గెజిట్ల­లో కరువు మండలాలను నోటిఫై చేసి అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)