Breaking News

నేతా.. ఇదేం రోత..?

Published on Fri, 07/03/2026 - 10:12

శ్రీకాకుళం: ఆయన ఓ ఎమ్మెల్యే. ఎక్కడైనా తప్పు జరిగితే సరిదిద్దాల్సిన వ్యక్తి. ఎవరికైనా ఇబ్బంది కలిగితే పరిష్కరించాల్సిన నాయకుడు. అలాంటిది సాక్షాత్తు ఎమ్మెల్యేనే చిన్న పిల్లల ఆస్పత్రి పక్కన రాత్రిపూట బర్త్‌ డే పార్టీ అంటూ నానా హంగామా చేశారు. ఆస్పత్రిలో ఉన్న వారు కంగారు పడిపోయేంత శబ్దాలు చేస్తూ దగ్గరుండి నృత్యాలు నిర్వహించారు. పాతపట్నంలో జరిగిన ఈ సంఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. 

పాతపట్నంలో బుధవారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే  మామిడి గోవిందరావు పుట్టిన రోజు వేడుకలు పట్టణం మధ్యలో ఉన్న ఎరుకోల కాంప్లెక్స్‌లో జరిగాయి. చిన్నపిల్లల ఆస్పత్రి, పాఠశాలలు వంటివి ఉన్న ప్రదేశంలో రాత్రి సమయం అని కూడా చూడకుండా పెద్ద సౌండ్‌ సిస్టంతో బర్త్‌డే పార్టీ చేయడంతో రోగులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈవెంట్‌ పేరుతో సున్నితమైన ప్రాంతాల్లో డాన్స్‌లు పెట్టడం సబబు కాదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు, నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు.  

ఇబ్బంది పెట్టడం దారుణం  
ప్రశాంత వాతవరణంలో ఉండే పాతపట్నంలో ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకల్లో ఈవెంట్‌ల పేరుతో నృత్యాలు చేయడం దారుణం. ఈవెంట్‌ పక్కనే చిన్నపిల్లల ఆస్పత్రి ఉన్నప్పటికి ఈవెంట్‌లకు పోలీసులు, అధికారులు వత్తాసు పలకడం విడ్డురుంగా ఉంది. ఎమ్మెల్యే దగ్గర ఉండి నృత్యాలు చేయించడం దారుణం. ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడు.      
– రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే పాతపట్నం    

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)